Thursday, December 20, 2012

ఏకాంతపు మొండిబతుకు

కావ్-కావె సఖ్త్-జానీ హా'ఏ తన్హా'ఈ న పూఛ్
సుభ కర్నా షామ్ కా లానా హై జూ-ఎ-షీర్ కా

ఏకాంతపు మొండిబతుకు, 

 గుండెనెలా తొలిచెనో అడగకు నను ;
   రేయి గడిపి పొద్దు చూడడం -
 
అవనికి మందాకిని దించినట్టే, విను.

కావ్-కావ్ = త్రవ్వడం, తొలచడం; సఖ్త్-జానీ = మొండి బతుకు ; తన్హా'ఈ = ఏకాంతం; జూ-ఎ-షీర్ =క్షీరనది.
 
హం నషీన్, మత్ కహ్నా కె బర్హం కర్  న బజ్మె-ఇష్కె-దోస్త్
వా తో మేరె నాలే కో భీ అ'ఇతెబారె-నఘ్మ హై
మిత్రమా! ప్రియురాలి ప్రణయగోష్ఠిలో   
రభస వలదని వారించకు నను ;
 నా శోకమైనా  సరే
కమ్మని పాటలా వినిపించు నచట, విను 

ఎక్ హంగామే పె మౌఖూఫ్  హై ఘర్ కీ రౌనఖ్ నౌహ-ఎ-మ్ హీ సహీ, నఘ్మ-ఎ-షాదీ న సహీ

ఒక కోలాహలం పై
ఆధారపడి ఉంది ఇంటి శోభ;
శోకవిలాపమైనా సరే,
ఆనందగీతి కాకపోయినా సరే.


హంగామ=కోలాహలం; మౌఖూఫ్=ఆధారితం; రౌనఖ్ =శోభ ; నౌహ = విలాపం; ఘమ్ = శోకం; నఘ్మ = గీతం ; షాదీ = ఆనంద, హర్షాతిరేకం ; సహీ = సరి.



 

Monday, February 6, 2012


నీ దర్శనలాలస వల్ల
నా చెమ్మగిల్లిన కళ్ళలోదాగె
 అడ్డులేని  ఆవేశాల
భాష్ప కల్లోలిని


Wednesday, February 1, 2012

 ہم نشیں مت کہہ کہ بر ہم کر نہ بزمِ عیشِ دوست
واں تو میرے نالے کو بھی اعتبارِ نغمہ ہے

హం నషీన్, మత్ కహ్నా కె బర్హం కర్  న బజ్మె-ఇష్కె-దోస్త్
వా తో మేరె నాలే కో భీ అ'ఇతెబారె-నఘ్మ హై



మిత్రమా! ప్రియురాలి రసికసభలో 
రభస వలదని  నీవేల వారించ   
నా  విలాపమైనా సరే కనుము
అచట  శ్రావ్యాలాపనై  వినిపించ