Tuesday, March 29, 2011

మధుశాలెక్కడుండాలి ? గాలిబ్

मस्जिद के ज़ेर--सायाह ख़राबात चाहिए !
भों पास आँख क़िबला--हाजात चाहिए !!

మసీదు ఛాయల్లో వెలయాలి మధుశాల
కనుబొమల క్రిందే కాంక్షలు తీర్చే శ్రీశాల

ఔషధంలేని వేదన

इश्क से तबीयत ने ज़ीस्त का मज़ा पाया !
दर्द की दवा पायी, दर्द--बेदवा पाया !!


ప్రేమవల్ల నా స్వభానికి జీవించే మజా సిద్ధించింది
వేదనకౌషధం లభించింది - ఔషధంలేని వేదన వరించింది.

कहते हो, " न देंगे हम, दिल अगर पड़ा पाया "
दिल कहाँ के गुम कीजे ? हमने मुद्धआ पाया

నా హృదయం దొరికితే ఇవ్వనంటావు తిరిగి,
మా లక్ష్యం నెరవేరింది, ఉంటే కదా, గుండె పోగొట్టుకోడానికి.

Monday, March 28, 2011

గాలిబ్ సహస్రకోరికలు

हज़ारों क्वाहिशें ऐसी के हर क्वाहिश पे दम निकले !
बहत निकले मेरे अरमान लेकिन फ़िर भी कम निकले !!

శతసహస్ర కోరికలు, ప్రతి కోరికపై పణం నా ప్రాణం
ఫలించెనెన్నో అభీష్టాలు ఐనాతక్కువే ఆ పరిమాణం

--- గాలిబ్

Sunday, March 27, 2011

ఎన్ని పాపాలు చేసిందో! ఒక కొత్త దృక్పథం

న్ని పాపాలు చేసిందో! జీవం పుట్టింది మనిషిగా
ఎన్ని త్యాగాలు చేస్తే ఎదిగిండు వాల్మీకి ఋషిగా
చూడు పక్షుల్ని- నిష్కపటంగా పాడుతున్నాయి ఖుషీగా
తీర్చింది విచక్షణ మనుజున్నిలోభిగా దోషిగా ద్వేషిగా

Friday, March 25, 2011

చాయామృతం

వేడివేడిగలేని చాయామృతం

విడివిడిగలేని సోనమసూరివరన్నం

కోడికూరలేని కోమటికూడు ఉల్లిపాయలేని ప

కోడి వంటివవి - పంటికి ఆనవు రామన్న!

Thursday, March 10, 2011

ప్రజాస్వామ్యమని మోసగించిరి
తెలగాన వారి గోసమరిచిరి
పది జిల్లల పిల్లలు జెల్లలు
ఒల్లం ఆంద్ర యని ఎంత వగచినా
దౌర్జన్యంగా మాపై దౌడు జేసిరి
సౌజన్యం గా వినకపోయిరి
ఆంధ్రుడు మా కడ దోపిడిగాడు
రాయలసీముడు భూ కబ్జాగాడు
సీమాన్ద్రునికిపుడు సిగ్గు లేదు
ఉమ్మినా తిట్టినా తుడుచుకున్నడు
దొమ్మికి దిగి మము దోచుకున్నడు
ప్రజాస్వామ్యమని మోసగించిరి
రజాకార్లనే మించిపోయిరి
నాలుగుకోట్ల నాలుకలొకటై
నినాదమే పోరు విధానమై
మా పాలన మాకేనని
తరిమి తరిమి కొట్టుదాం
కొత్త అస్త్రాలు పట్టుదాం
ప్రజాస్వామ్యమని మోసగించిరి
తెలగానవారి గోసమరిచిరి

Wednesday, March 9, 2011

విరహరాత్రులు

नहीं के मुझको क़यामत का एतिक़ाद नहीं !
शब्- फ़िराक से रोज़- जज़ा ज़ियाद नहीं !!

ప్రళయం లేదని కాదు నా నమ్మకం!
కాళరాత్రి కంటే విరహరాత్రులే కష్టతరం !!
___గాలిబ్