Saturday, October 29, 2011

ఉర్దూ హల్లుల ఉచ్చారణ సూచీ

ఉర్దూ హల్లుల ఉచ్చారణ సూచిక

ఫార్సీ, అరబ్బీ పదాలను విరివిగా ఉపయోగించుకునే ఉర్దూ భాషలోని వ్యంజనాలను (consonant) భారతీయ భాషల్లో పలికించడం కష్టమే. స్వరాలతో (అచ్చులు) పెద్ద ఇబ్బంది లేదు. అయితే, ఒక విశేషమైన గుర్తు వాడి ఆ అక్షరాలను ఉచ్చరించడం సులభమే. కొంత అభ్యాసం కావాలి. అలా గుర్తించి చదివినప్పుడే ఉర్దూ కవితలు విన సొంపుగా శ్రావ్యంగా అర్థవంతంగా ఉంటాయి.
మనకు సర్వసాధారణంగా ఉర్దూ సాహిత్యంలో తారసపడే అభారతీయ (non-Indian) హల్లులు ఇవి: ख़ , ग़ (), , జ फ़హిందీ వాళ్ళు చక్కగా అక్షరం కింద ఒక చుక్క పెట్టుకొని ఫార్సీ/అరబ్బీ శబ్దాలను వేరుగా గుర్తించి చదువుతున్నారు. మనకు అలాంటి సౌకర్యం లేదు. చాల ప్రయత్నం చేశాను. అక్షరం కింద చుక్క సాధ్యం కాలేదు. కాబట్టి ఒక చిన్న గీతతో (underline) తో ఇలాంటి అక్షరాలను గుర్తించే నియమం ఈ పుస్తకంలో చేయబడింది. వాక్శుద్ధి లేక భాష, సాహిత్యంతో పరిచయంలేక గజల్ ను గజల్ అని ఉచ్చరించి ఉర్దూ భాషకు క్షమించరాని అన్యాయం చేస్తూ గొప్ప గాయకులుగా (గంధర్వులుగా)చలామణి అవుతూ ప్రశంసలు, పారితోషికాలు దోచుకున్న, దోచుకుంటున్న మూర్ఖులను ఏమని పిలవాలో అర్థం కావడం లేదు.

ఉచ్చరించే పధ్ధతి:

ఖ = ఈ శబ్దం గొంతు చివరనుండి ధ్వనించవలె. తెలుగు ఒత్తు 'ఖ' గొంతు (కంఠ్యం) చివరి నుండి . ఉదా: ఖతం, ఖబర్, ఖుదా
ఘ & గ = ఇవి కూడా పై దానివలెనే(కంఠ్యం) కాని 'ఘ' గొంతు చివరి నుండి పుట్టించవలె. ఉదా: గాలిబ్, గజల్ , ఘమ్, ఘలత్
జ = ఇది ఇంగ్లీష్ Z లా ధ్వనించే హల్లు. ఉదా: జమాన, జిందగీ, జనానా
ఫ = ఇది ఇంగ్లీష్ F లా ధ్వనించే హల్లు. ఉదా: ఫలక్, వఫా, ఫాయెద

ఉర్దూ గజల్లు విని ఆనందిచే వారికి ఇక్కడ వాడిన పధ్ధతి అతి సులభంగా అర్థమౌతుంది.


గాలిబ్ కు ఫార్సీ భాషతో అమితమైన అనురాగం. ఆయన ఉభయభాషా ప్రవీణుడు. అయినా ఆయనకు ఉర్దూ కన్నా ఫార్సీలో కవిత చెప్పడమే ఇష్టం. కవిత్వానికి ఫార్సీయే సరియైన మాధ్యమమని నమ్మేవాడు. ఉర్దూలో కవిత చెప్పాల్సి వచ్చినందుకు మథనపడ్డాడు. ఉర్దూ కవితను కేవలం సామాన్య రసికబాహుళ్యం కోసమే సృష్టించాడట. తన అసలు కవిత్వామ్నాయమంతా ఫార్సీ కవితల్లోనే ఉందని, అక్కడే తన విద్వద్విశ్వరూపమంతా ఉందని చెప్పుకున్నాడు.

Sunday, October 2, 2011

నీ మాట నమ్మిన జీవితం

తెరే వాదె పర్ జియే హమ్ తో ఏ జాన్ ఝాట్ జానా
కె ఖుషీ సె మర్ న జాతే అగర్ ఏత్బార్ హోతా

నీ మాటనమ్మి నే జీవించడం,
తెలుసుకో ఇది అసత్యమేనని నాకెరుక
సంతోషంలో చావక పోదునా
నీ మాట పై ఉంటే నాకు నమ్మిక