Monday, December 13, 2010
ఇండియా-నీరా రాడియల 2G
లక్షలాదికోట్ల కుంభకోణము 'రాజా' స
మక్షమున సంభవించినా; కౌరవ
పక్షపాతులవోలె దృష్టి హీనులయిరి ప్రజా
సంక్షేమక్షయకరుల్ రాజకీయరాక్షసుల్.
ఇండియాను 'నీరాడియా'విషకన్య తన
రొండి సొగసులందాడించగ, మంత్రులు లంచ
గొండులై కామినీవిటులై, దండి 'టాటా'దులకై
గండికొట్టిరి దేశసంపదకు తిండిలేనిప్రజలన్ మరిచి.
Tuesday, September 7, 2010
రక్తకన్నీరు
रगोमें दौड़ते फ़िर्नेके हम नहीं खायिल !
जब आँख ही से न टपका तो फ़िर लहू क्या है !!
ధమనుల్లో పరుగెత్తడం, ఏముంది అందు గొప్పతనం;
కళ్ళనుండి రాలినపుడే రక్తమౌతుంది సార్థకం.
__గాలిబ్
जब आँख ही से न टपका तो फ़िर लहू क्या है !!
ధమనుల్లో పరుగెత్తడం, ఏముంది అందు గొప్పతనం;
కళ్ళనుండి రాలినపుడే రక్తమౌతుంది సార్థకం.
__గాలిబ్
Wednesday, September 1, 2010
వర్షాకాల నియంత
వర్షాల ఉత్కర్షకు హర్షించే
సంపన్నులొక వైపు,
భాగ్యనగరిలో భయంతో
బ్రతికే అభాగ్యులొక వైపు
బీదల వీథులన్నీపర్జన్యుని
బాధల్లో బంధీలయ్యాయి
వాళ్ళ గూళ్ళన్నీ వానకు
మళ్ళీ వరిమళ్ళయ్యాయి
వరుణుడి చల్లని బాణాలకు
వృద్ధుల ప్రాణాలు పారిపోయాయి
గొల్లున ఏడ్చిన పిల్లల తనువులు
తల్లుల ఒళ్లలో ఒదిగి పోయాయి
ఏతం ఎత్తినట్లు ఆడవాళ్ళు
నీళ్ళు తోడేస్తున్నారు
పొంచి ఉన్నఉపద్రవాలు విని
ఆర్తులు అప్రమత్తులయ్యారు
నీడలేని నిరాశ్రయులకు
పస్తులు, జాగారాలు
ఐశ్వర్యుల హర్మ్యాలలో
నిరంతర నిశావైభోగాలు
ఒకరిది రేపటిపై నైరాశ్యం
ఆశనిపాతంలాంటి ఆక్రోశం;
ఒకరిది కలల వలలో
చిక్కిన ఉత్సవపరితోషం
కొత్తనవాబుల విలాసాల విడిదిలో
గజల్లు, గంధర్వగానాలు
వెచ్చని శాలువాలు,
నచ్చిన షాయరీ శకలాలు
మత్తెకించే ఉన్మదన సౌరభాలు
మరులనే మాయజేయు ఒయ్యారాలు
మాటిమాటికి జారే జరీజార్జెట్లు
నాభినక్షత్రాలు ప్రదర్శించే కోక్కట్లు
ప్రమాద హేతువులాయె
ప్రమదాపరిధానాలు
శ్రావణ జడివానల ప్రతి జల్లు
వారుణీవరులను గిల్లు కలిగించును థ్రిల్లు
చేతుల్లో మైమరిపించే మధువు
అధరాలపై మృదు ఉరుదూకవితావధువు
క్లబ్బుల్లో జబ్బులుపెంచే పబ్బుల్లో
వికృతవినోదాలు, నికరక్రీడలు
గాలి ఆడని బస్తీల్లో నీటికోసం
కుస్తీలు, దోమకాట్లకు సుస్తీలు
స్టార్ హోటళ్ళ స్కాచ్ బాటళ్ళనుంచి
జాలువారే మనోహరమదిరాలు
ప్రియసఖీ సంయోగ కవోష్ణ-
సుఖాలందించే స్వప్నమందిరాలు
ఇదేమి న్యాయమో
ఇదెక్కడి ధర్మమో
ఇదేమి స్వామ్యమో
ఏ ప్రజల సంక్షేమమో
ఈ వర్షాకాలనియంతకు
బానిసలయిరి నా ప్రజలు
ప్రకృతి వైపరీత్యాలను
పండుగ చేసిరి పాలకులు
సంపన్నులొక వైపు,
భాగ్యనగరిలో భయంతో
బ్రతికే అభాగ్యులొక వైపు
బీదల వీథులన్నీపర్జన్యుని
బాధల్లో బంధీలయ్యాయి
వాళ్ళ గూళ్ళన్నీ వానకు
మళ్ళీ వరిమళ్ళయ్యాయి
వరుణుడి చల్లని బాణాలకు
వృద్ధుల ప్రాణాలు పారిపోయాయి
గొల్లున ఏడ్చిన పిల్లల తనువులు
తల్లుల ఒళ్లలో ఒదిగి పోయాయి
ఏతం ఎత్తినట్లు ఆడవాళ్ళు
నీళ్ళు తోడేస్తున్నారు
పొంచి ఉన్నఉపద్రవాలు విని
ఆర్తులు అప్రమత్తులయ్యారు
నీడలేని నిరాశ్రయులకు
పస్తులు, జాగారాలు
ఐశ్వర్యుల హర్మ్యాలలో
నిరంతర నిశావైభోగాలు
ఒకరిది రేపటిపై నైరాశ్యం
ఆశనిపాతంలాంటి ఆక్రోశం;
ఒకరిది కలల వలలో
చిక్కిన ఉత్సవపరితోషం
కొత్తనవాబుల విలాసాల విడిదిలో
గజల్లు, గంధర్వగానాలు
వెచ్చని శాలువాలు,
నచ్చిన షాయరీ శకలాలు
మత్తెకించే ఉన్మదన సౌరభాలు
మరులనే మాయజేయు ఒయ్యారాలు
మాటిమాటికి జారే జరీజార్జెట్లు
నాభినక్షత్రాలు ప్రదర్శించే కోక్కట్లు
ప్రమాద హేతువులాయె
ప్రమదాపరిధానాలు
శ్రావణ జడివానల ప్రతి జల్లు
వారుణీవరులను గిల్లు కలిగించును థ్రిల్లు
చేతుల్లో మైమరిపించే మధువు
అధరాలపై మృదు ఉరుదూకవితావధువు
క్లబ్బుల్లో జబ్బులుపెంచే పబ్బుల్లో
వికృతవినోదాలు, నికరక్రీడలు
గాలి ఆడని బస్తీల్లో నీటికోసం
కుస్తీలు, దోమకాట్లకు సుస్తీలు
స్టార్ హోటళ్ళ స్కాచ్ బాటళ్ళనుంచి
జాలువారే మనోహరమదిరాలు
ప్రియసఖీ సంయోగ కవోష్ణ-
సుఖాలందించే స్వప్నమందిరాలు
ఇదేమి న్యాయమో
ఇదెక్కడి ధర్మమో
ఇదేమి స్వామ్యమో
ఏ ప్రజల సంక్షేమమో
ఈ వర్షాకాలనియంతకు
బానిసలయిరి నా ప్రజలు
ప్రకృతి వైపరీత్యాలను
పండుగ చేసిరి పాలకులు
Sunday, August 22, 2010
ఓంనగర్ జ్ఞానపీఠం
పామరులకైనా పాండిత్యము నేర్పు,
జిజ్ఞాసులందు పిపాసపెంచు
రామభక్తియందాసక్తి కలిగించు,
పాదచారపవనవాగ్ములకు వి
శ్రామమిచ్చు, జ్ఞానవిజ్ఞానచర్చలింపుగాసాగించు,
ధ్యానహఠయోగులకా
రామమై యుండు, ఓంనగర వనమందు
విరజిల్లె విజ్ఞులజ్ఞానపీఠం
జిజ్ఞాసులందు పిపాసపెంచు
రామభక్తియందాసక్తి కలిగించు,
పాదచారపవనవాగ్ములకు వి
శ్రామమిచ్చు, జ్ఞానవిజ్ఞానచర్చలింపుగాసాగించు,
ధ్యానహఠయోగులకా
రామమై యుండు, ఓంనగర వనమందు
విరజిల్లె విజ్ఞులజ్ఞానపీఠం
Sunday, August 8, 2010
సీమాంధ్రులు మదాంధులు
సీమాంధ్ర మదాంధ నేతలు
కావరం పట్టిన మాటలు
కపటం నిండిన చేతలు
సీమాంధ్ర మదాంధ నేతలు
వారి దుర్మార్గపు కూతలు.
తెలంగాణ కోరితే దేశద్రోహులమంట
తెలగాణ్యులంతా జాతి శత్రువులంట
సమైక్యాంధ్రుల కల్లబొల్లి లొల్లిల
తెలంగానోల్లున్నర? కలిసుందామన్నర?
ఏకపక్ష ప్రేమ ద్వేషాలకు తెరుస్తుంది తలుపు
ఇద్దరికిష్టమయినపుడే పండుతుంది వలపు
ఇష్టమైతేనే దోస్తీ
చెల్లదు మీ ఆంద్ర జబర్దస్తీ
మీ అన్యాయాలకిక స్వస్తి
లేదంటే ఇగ కుస్తీమస్తీ
రద్దయింది మీతో మా పొత్తు
మీరు దోచిందంతా మాదే సొత్తు
మీ గుండెల్లో విషముంది నిలువెత్తు
సీమాంధ్ర అసెంబ్లీ దొంగల పరిషత్తు
తర్కాలన్నిట బద్దలయింది ధూర్తులభాండం
వింతవాదంతో చేస్తున్నారు వీరు వితండం
వాళ్ళ మనుగడకే ఇక దినదిన గండం
కావాలె మన ఘోష అఖండం ప్రచండం
వికృత వాక్కులు వల్లించారంటే
విషశరాలు మనపై విసిరినట్టే
ఇంగితజ్ఞానం విడిచి తెగించారంటే
వినాశకాలం వాళ్ళను వెంటాడుతున్నట్టే
పెగ్గులు పెగ్గులు పోసి దుగ్గల్ని కొనుక్కున్నారట
చీరెలు సారెలు పెట్టి కౌరును వాడుకున్నారట
దారుస్సలాముల దావతిచ్చి షరీఫ్ ను షర్మిన్ద చేసిండ్ర ట
న్యాయం చెప్పే శ్రీకృష్ణున్ని శకునిగ మార్చేసిండ్రు
ధర్మగీత చెప్పేవానితో అధర్మరాతలు రాయిన్చిండ్రు
దోపిడీకి మరిగిన దొంగలను ఊరికే వదులుదామ?
చావిడీకి ఈడ్చి వీళ్ళను వేళ్లాడ తీస్తామా?
కొవ్వు పట్టిన కుక్కలను తరిమి తరిమి కొట్టుదాం
తెలంగాణ గడ్డనుంచి గుడ్డలొలిచి తోలుదాం
రామచందర్ దీకొండ
Saturday, August 7, 2010
Anti-National Remarks of Andhra Ministers
Andhra integrationists have yet once again displayed their brazen hatred towards Telangana state. The remarks made by SeemaAndhra ministers after making their presentation before the Justice Sri Krishna Committee on 6th August, 2010 are highly objectionable and deplorable. Till yesterday, I had a different opinion about the integrity and the morality of the Andhra and Seema people in general and leaders in particular. I thought they had at least one valid tenable reason to oppose the disintegration of the state of Andhra Pradesh. Now with this statement that those who are aspiring for a separate state of Telangana are anti-nationals and they must be prosecuted for treason has changed my glimmering good opinion about these SeemaAndhra leaders. These Andhra leaders who pose themselves to be highly intelligent and law-knowing have fallen from the esteem of simple people of Telangana region. By speaking against the provisions of the Constitution of India, they have rendered themselves liable to be prosecuted for the anti-national provocative remarks.
Andhras must know, and they do know, that creation of new states within the frame work of the Constitution of India is not only provided for in the clearest terms, but also practiced time and again in the federal polity. So many new states were either created or bifurcated yielding to the legitimate demands and long cherished aspirations of the people. Andhra intellectuals must realize that a government is there in a democracy to cater to the aspirations and demands of its people who have elected it. The unashamed statement made by the ministers sounds as if it was made by a bigoted Andhra fanatic in the streets of Vijayawada or Guntur. All those persons who went as a team to the Committee were ministers holding constitutional offices in the government. They are well aware, that their own state of Andhra was formed out of Madras state, after a great struggle launched by Shri Potti Sriramulu. By their own logic, even this leader must be imputed with the charge of treason for fighting for a separate state of Andhra.
By this statement Andhras have forfeited their right to live in Telangana. What kind of attitude towards Andhra vested interests can be expected of Telanganites after the formation of their state. In my opinion, SeemaAndhras have not only displayed their hatred towards Telangana but spewed venom. My opinion about Andhras that they were more refined, educated and smart has crashed like a failed jet. They stooped to the level of comparing the unrest in Kashmir with the just cause of Telangana. It is now proved beyond doubt that Andhra and Seema leaders have no interest in the people telangana, they are just worried about their ill-gotten wealth made out of the resources of this region. They have started conducting themselves has lunatics because they have no point in their favour. Their statement is an out come of deep frustration and a sign of acceptance of defeat. Otherwise, how can these intelligent ministers blurt out these uncanny remarks. All their arguments against Telangana are falling like a castle of cards. They should always bear in mind that they cannot compel us to live with them. No law can support this. We now hate them for their misdemeanor. I have today declared them as personea non gratae from my side. I am sure all supporters of this just cause shall do the same.
Now, having committed this grave blunder, they must tender their unconditional apology to the people of Telangana forthwith. Otherwise, they have no right to continue as ministers nor do they have a right to live here. These ministers must be gheraoed wherever they are found. They must be taught a lesson in a befitting way.
Ramchander Deekonda
Tuesday, August 3, 2010
ఆత్మహత్యలు వినాశాకరమైనవి
తెలంగాణా ప్రజలు మళ్ళీ ఇంకొకసారి నిరూపించుకున్నారు స్వరాష్ట్రం కోసం వారి ప్రతిబద్ధతను.ఇపుడు సెంటిమెంటు గా పేర్కొనబడే ఆకాంక్ష ఒక బలమైన ప్రజాస్వామికమైన, రాజ్యాంగానికి లోబడిన డిమాండుగా పరిణమించింది. ఏ ప్రజాస్వామిక వ్యవస్థ ఈ డిమాండును కాదనలేదు. ఈ ఉద్యమాన్ని, ఈ జనచైతన్యాన్ని కాదంటే, ఇక ఇది ప్రజాస్వామ్యమే కాజాలదు. ఒక రాష్ట్రం, వారి అభ్యుదయం కోసం స్వయంపాలనకోసం తిరిగి ఏర్పడాలనేది వారి ప్రఘాడ ఆకాంక్ష. తెలగాణ్యులు అమాయకులే కావొచ్చు, కాని అవివేకులుమాత్రం కాజాలరు. మళ్ళీ ఆ సీమాంధ్రుల తీపిమాటల బుట్టలో పడలేరు. నూటికి నూరు శాతం గెలిచారంటే అది ఒక గొప్పఐక్యతా ప్రదర్శనే మరి. ఉద్యమంలో ద్రోహులెప్పుడూ ఉంటారు. వాళ్లకు కూడా బుద్ధి వస్తుందని ఆశిద్దాము.
అయితే, యువకులు భావోద్రేకాలకు లోనయి అనవసరంగా ఆత్మహత్యలకు పాల్పడటం చాల బాధాకరమైన విషయము. అసలు తెలంగాణా రాష్ట్రం వాళ్ళకోసమే కదా మనందరం కోరేది. వాళ్ళు అనుభవించని తెలంగాణా మనకెందుకు. మా జీవితాలు ఎట్లాగో గడిపాం. వివక్షకు, శోషణకు, అపహాస్యాలకు, హేళనకు గురయ్యాము. మన పిల్లలు అట్లాంటి బాధలు అనుభవించ వద్దు. నిరాశ నిస్పృహను కలిగిస్తుంది. అక్కడినుంచి ఎన్నో వికారాలు బయలుదేరుతాయి. ఒకానొక బలహీనక్షణములో బ్రతకడమే అనవసరమనిపిస్తుంది. ఆ భయంకర క్షణాలని అధిగమించాలి. దీనికి మంచి ఉదాహరణ రామాయణంలో ఉంది. సీతమ్మను వెతికి వెతికి అలసిపోయి నిరాశకు గురి అవుతాడు హనుమంతుడు. సీతమ్మ కనపడలేదని ఎట్లా చెప్పగలడు రామునికి. ఆ పని చేయలేడు కాబట్టి, ప్రాణాలను వదిలేందుకు నిర్ణయిస్తాడు. అయితే ఆ క్షణంలో ఒక ధైర్య కిరణం అతని మదిలో వెలుగుతుంది. నేనైతే చచ్చిపోతాను, కాని ఆ తర్వాత పర్యవసానంగా ఏమౌతుంది అనికొంచెం సావధానంగా ఆలోచిస్తాడు మన మారుతి. అతనికి ఎంతో దారుణమైన చిత్రం గోచరిస్తుంది. 'నాకోసం వేచి వేచి రాముడు ఖిన్నుడౌతాడు . సీత జాడతెలియక శ్రీరాముడు ప్రాణాలు వదలడం ఖాయం. అది చూసి లక్ష్మణుడు కూడాచనిపోతాడు. ఇదంతా చూసి కిష్కింద రాజు, రాముని మిత్రుడు, సుగ్రీవుడు కూడా ఏదో చేసుకోరానిది చేసుకుంటాడు. ఆతర్వాత వానర రాజ్యం నశిస్తుంది. అయోధ్యలో అల్లకల్లోలం చెలరేగుతుంది. ఇట్లాగ వినాశ పరంపర సాగిపోతుంది. ఇవన్నీ నా ఆత్మహత్య వల్ల కలిగే ఉపద్రవాలు. కాబట్టి, ప్రాణం విలువైనది. ఓపికతో నిష్టతో ప్రయత్నిస్తే లక్ష్యం తప్పక నెరవేరుతుంది' అని అనుకొని ఆత్మహత్యా ప్రయత్నాన్ని విరమించుకుంటాడు హనుమంతుడు. "వినాశే బహవో దోషా జీవన్ ప్రాప్నోతి భద్రకం, తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవతి సంగమః " (సుందర కాండ) ఆత్మహత్య వినాశాకరమైనది. అది పాపకార్యం కూడాను. ఆత్మహత్య ఎన్నో దోషాలకు దారి తీస్తుంది. బ్రతికి ఉంటే ఎన్నడో ఒకనాడు తప్పక మనలక్ష్యం నెరవేరుతుంది. ప్రాణాలను కాపాడుకొని ఉద్యమించడమే అన్నివిధాల శ్రేయస్కరం. అని నిర్ణయించుకొని కృతార్థుడౌతాడు మన వీరహనుమాన్. ఆయనే మనకు ఆదర్శం, మార్గదర్శి. ఆత్మహత్యకు పాల్పడే వారు నరకలోకాలను అనుభవిస్తారని ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయి. "అసుర్యా నామ తే లోకా అంధేన తమసా ఆవృతా: , తాం తే ప్రేత్యాభిగఛ్చంతి యే కే చ ఆత్మహనో జనా:" (శ్రీ ఈశోపనిషత్తు) అంటే ఆత్మహత్య చేసుకున్న జనులు, అంధకారము అజ్ఞానములచేత ఆవరింపబడిన అసుర (నరక) లోకాలను పొందుతున్నారు. అందుచేత -
"ఆత్మత్యాగమొద్దు తెలగాణ వీరుడా, మ
హాత్ములవోలె పోరు సల్పుదాం మనము, దు
రాత్ముల నికృష్ట నీతులను దునుమాడి, విజి
తాత్ములమై విరుచుకుపడదాము తుదకు."
ఈ సందర్భంలో ఒక ఉర్దూ కవి అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి. थर थराते हैं अन्धेरे तो लरज़ थे क्यों हों? हर नयी सुबह कि तकलीक यूहीं होती है। నిరాశ చీకట్లు కమ్ముకుంటుంటే అట్లా ఎందుకు వణికిపోతావు మిత్రమా? ప్రతి ఉషోదయం ముందు ఇలాగే ఉంటుంది తంతు. ఇంకొక గొప్ప ఉర్దూ కవి ఇక్బాల్ ఏమంటాడో చూడండి. अगर उस्मानियों पर (read तेलंगानियों पर) खोय-ए- ग़म टूटा तो क्या ग़म है? के खून-ए-सद हज़ार अंजुम से होती है सहर पैदा. (తెలంగాణీయుల) ఉద్యమకారుల మీద ఎన్ని కష్టాల పర్వతాలు విరుచుకుపడ్డా అవేమి భరించరాని బాధలు కావు. వాళ్ళు భయపడరు. కారణం, అసంఖ్యాక నక్షత్రాలు రాలిన తర్వాతే కదా శుభోదయం ప్రాప్తిస్తుంది.
అందుచేత తెలంగాణా వీరులారా, చచ్చి సాధించేది ఏమి ఉండదు. బ్రతికిఉన్నవారికే అన్నీ ప్రాప్తిస్తాయి. ఈ సత్యాన్ని గుర్తెరిగి ఓపిక సంయమనం ధైర్యంతో ముందుకు సాగుదాం. ఆత్మహత్య మహా పాపం, ఆశుభకరం. మనను కన్నవారికి ఆప్తులకు శోకాన్ని మిగిల్చిన వారమవుతాము. అలాంటి దురాలోచనలకు దూరంగా ఉండాలి. ఎవరైనా ఈ దారుణమైన విషయాన్ని చర్చిస్తే ఆ ధోరణి వారిలో గమనిస్తే అందులో దాగిఉన్న దుష్పరిణామాలను వారికి వివరించి ఆ చెడుమార్గము నుంచి వారిని తప్పించాలి. ఇది అందరి కర్తవ్యం.
దీకొండ రామచందర్
9966354106

Sunday, July 18, 2010
గాలిబ్ - జన్నత్ - భక్తి ప్రపత్తి
बंदगी में भी वो आज़ाद-ओ-ख़ुदबीन हैं के हम
उलटे फ़िर आये दर-ए-काबा अगर वा न हुआ
భక్తి ప్రపత్తుల్లోనూ మేమెంతో స్వతంత్రులం
మాకుంది అభిమానసుఖం !
'కాబా' ద్వారం తెరిచి లేకుంటే
పడతాము మేము తిరుగుముఖం !!
__గాలిబ్
చూసారా గాలిబ్ వ్యక్తిత్వం ఎలాంటిదో. మహా అహంకారి. సంప్రదాయ మతానికి చెందిన నిర్దిష్ట కర్మలు,వాటి మర్మాన్ని ఆంతర్యాన్ని ఎరిగిన అసలైన సిసలైన మానవతావాది గాలిబ్. ఛాందస వ్యవహారాలంటే ఆయనకు గిట్టవు. ఈనాటి మతపిచ్చి గాలిబ్ లాంటి మహాకవిని సహించలేదు. పైన చెప్పిన భావము కల 'చమత్కవిత' ఈ శతాబ్దిలో ఏ ముస్లిం కవి కైనా చెప్పడం అతికష్టం.
గాలిబ్ మత గ్రంథమైన ఖురాన్లో చెప్పబడ్డ స్వర్గం (జన్నత్) ను ఎన్నడూ కోరుకోలేదు. ఇహలోకంలోఇస్లాంని తు.చ.తప్పకుండా పాటించే ముస్లిములకు పరలోకంలో ప్రసాదిస్తానని అల్లా ఒప్పుకున్న అనంతభోగాల సమాహారమే జన్నత్. గాలిబ్ ని ఆ జన్నత్ సుఖాలు ఆకర్షించకపోవడానికి కారణం, అచ్చట వర్ణించబడ్డ స్వర్గం ఎలాంటిదో , అక్కడ లభించే సుఖసౌఖ్యాలు ఏపాటివో ఆయనకు బాగా తెలుసునట. కాబట్టి ఆ కథాకథిత 'జన్నత్' గురించి గాలిబ్ పట్టించుకోలేదు. 'జన్నత్' అనే భావన మనసును సంతోషపెట్టేందుకు మాత్రం బాగా పనికి వస్తుంది అని అంటాడు. ఇహలోకంలోని సుఖాలను కాదని ఎక్కడో ఉందని చెప్పబడుతున్న పరలోకసుఖాలకోసం గాలిబ్ అర్రులుచాచినట్టు ఎక్కడా కనిపించదు.ఇలాంటి భావజాలాన్ని ఈ సహనంలేని అతివాద యుగంలో చెప్పడం ముస్లిం సమాజంలో పుట్టిపెరిగిన బుద్ధిజీవులకు దాదాపు అసాధ్యమే. ఈ కవితావాక్యాన్ని పరిశీలించండి.
हम को मालूम है जन्नत की हक़ीक़त लेकिन,
दिल के ख़ुश रखने को ग़ालिब ये ख़याल अच्छा है
మేమెరుగుదుము ఆ జన్నత్ లోని వాస్తవాలు, అయినా.....
మనసును సంతోషపెట్టేందుకు ఓ గాలిబ్, బావుంది ఈ భావన

Friday, July 16, 2010
అసదుల్లః ఖాన్ గాలిబ్ గురించి బహుశ తెలియని వారుండరు మన దేశంలో. ముఖ్యంగా తెలంగాణాలో ఇంకాముఖ్యంగా హైదరాబాద్లో పుట్టి పెరిగిన వారు ఎవరైనా సరే వాళ్ళ మాతృభాష ఏదైనా సరే వారికి సాహిత్యంలో ప్రవేశంఉన్నా లేకపోయినా ఎప్పుడో ఒకప్పుడు గాలిబ్ గురించి తప్పకుండ అప్రయత్నంగానైనా వినే ఉంటారు. ఏదో ఒక కవిత గాలిబ్ దో లేకపోతె గాలిబ్ పేరున చెప్పిందో వినే ఉంటారు. అర్థం అయినా కాకపోయినా 'వాః క్యా బాత్ హై' అని స్పందిచేఉంటారు. ఇది అతిశయోక్తి ఏమాత్రం కాదు. హైదరాబాద్ సంస్కృతి చాల విలక్షణమైనది. ఇక్కడివారు ఇంట్లోమాట్లాడేభాష ఏదైనాకాని వాళ్ళు ఇంటిబయట వాడుకునే 'మాట' భిన్నంగా ఉంటుంది. ఉర్దూ తో ఉన్న అనుబంధం మూలాన ఇక్కడి భాష చాలా సంపన్నమైనదనే చెప్పాలి. ఉర్దూ ద్వారా ఎన్నో తుర్కి, పార్సీ, అరబ్బీ పదాలు తెలుగు లోకి చేరిపోయాయి. సంస్కృతం తర్వాత ఉర్దూ పదాలే తెలుగులో గుర్తు పట్టలేనంతగా మిలితమైపోయాయి. ఉర్దూ క్రియారూపాలు తెలిగించబడి తెలగాణ్యుల భాషలో ఏ రకంగా మమేకం పొందాయి అనేది పరిశోధనకు సామగ్రి. ఉదాహరణకు: గుసాయిస్తున్నాడు , ఫిలాయిన్చిండు , రోకాయిస్తున్నాడు.మన పత్రికల్లో వాడేభాషలో నుంచి సంస్కృతం ఉర్దూ పదాలు ఏరి వేస్తె గందర గోళం మిగులుతుంది. ఒక సారి ప్రయత్నించండి.
దీవాన్-ఎ-గాలిబ్ చదువుతాను. నాకు కూడా గాలిబ్ ని తర్జుమా చేయాలని కోరిక పుడుతుంది ఒక్కోసారి.అంత సాహసమా! తరతరాలనుండి ఈ గడ్డపై ఉన్నవాళ్ళం కాబట్టి ఆ మాత్రం ఉత్సుకత ఉండాల్సిందే మరి. ఒక పదిషేర్లయినా తెలుగో ఇంగ్లీషో చేయాలని ప్రఘాడ కోరిక నాది. చూద్దాం. ఈ రకంగా అలోచించి రెండు తెలిగించాను. తెగించాను. ఉర్దూ లిపి నాకు లభ్యం కావడం లేదు కాబట్టి హిందీ లో మూలాన్ని రాస్తున్నాను. చదివి విమర్శించండి.
ये मसाइल-इ तसव्वुफ़, यह तेरा बयान ग़ालिब
तुझे हम वली समझते, जो न बादा-ख्वार होता
ఓ గాలిబ్! ఈ నిగూఢ సూఫీవాదం, నీ విలక్షణాభివ్యక్తి
నిను ఋషిగా కొలిచే వాళ్ళం నువు మధువుకు చెపితే స్వస్తి
Ah Ghalib! the mystique of your plaint
your expressions so fine;
We'd have taken you for a saint
had you not taken to wine.
इशरत-ए -खत्रह है दरया में फ़ना हो जाना;
दर्द का हद से गुज़र् जाना है दवा हो जाना
బిందువుకు సింధువులో విలీనమే ఆనందం;
శోకం హద్దులు దాటితే అవుతుంది ఔషధం.
हुए मर के हम जो रुसवा, हुए क्यूँ न गर्क-ए-दरिया
न कभी जनाज़ा उठता, न कहीं मज़ार होता
చచ్చి నేను భ్రష్టునయ్యేకంటే గంగలో కలిసేది మేలు
శవయాత్ర ఉండేది కాదు, నాకు సమాధి మిగిలేది కాదు

Thursday, July 15, 2010
యూరప్ లో వీథులు
The following lines were written by me after my tour to Europe in October 2006. I was highly impressed by the cleanliness and the civic sense of the people of those countries. Contrary to what I often heard and read about the tension, stress and restlessness, I saw people very calm, quite and relaxed in many European cities. It was only in London I observed people hurrying in the streets. Otherwise, they are perfectly at peace with themselves. Also Europeans are known for hiding their feelings in public. On the whole, my opinion about the people of those lands is that they are highly civilized and well-behaved. The architectural marvels they created stand testimony to their genius. Roads and sanitation are the barometers of a community's levels of civilizational refinement. They simply excel in those matters.
యూరపులో ప్రతి వీథి
శశిమండిత నిశీథి
ప్రశాంతతే వాటి నీతి
విను రామన్న!
లండన్ ప్యారిస్ రోములు
నాగరికతలో అగ్రగాములు
ప్రజలంతా సుఖకాములు
విను రామన్న!
స్విట్జార్లాండ్ బజార్లు
వాటి శుభ్రతకు జోహార్లు
శబ్దం చేయవు కార్లు
విను రామన్న!
Wednesday, July 14, 2010
మానసిక వైద్యం హోమియోపతి
మానసిక వైద్యం హోమియోపతి
శాస్త్రీయ మార్గం అలోపతి
మందులులేనిది న్యాచురోపతి
విను రామన్న!
కళ్ళకు ఒచ్చేది రెటినోపతి
మధుమేహానికి న్యూరోపతి
అన్నిట ముందు
ఆఖరి మందు తిరుపతి
విను రామన్న!
శాస్త్రీయ మార్గం అలోపతి
మందులులేనిది న్యాచురోపతి
విను రామన్న!
కళ్ళకు ఒచ్చేది రెటినోపతి
మధుమేహానికి న్యూరోపతి
అన్నిట ముందు
ఆఖరి మందు తిరుపతి
విను రామన్న!
Monday, July 12, 2010
సంస్కృతంలేని తెలుగు
సంస్కృతంలేని తెలుగు
మీగడలేని పెరుగు
కుంటివాని పరుగు
విను రామన్న!
సంస్కృత-ద్రవిడ దాంపత్యం
తెలుగుగ పుట్టెను అపత్యం
మన కావ్యాలకిదే నేపథ్యం
విను రామన్న!
తెలుగంటే నాకభిమానం
సంస్కృతం దానికి బహుమానం
రెంటి కలయికే ప్రమాణం
విను రామన్న!
ఉర్దూ నా ప్రేయసీ
ఇంగ్లీషు ఒక ఫ్యాన్టసీ
గీర్వాణం నా మానసీ
విను రామన్న!
పంతులురాని పాఠశాల
మందులులేని వైద్యశాల
సంక్షేమమే దివాలా -
సంక్షేమమేది? ఇవాళ
విను రామన్న!
అన్యాయమే శాశ్వతం
న్యామెపుడూ చంచలం
ఇతిహాసమిదే కలకలం
విను రామన్న!
ఆకాశంలో విమానం
దిగేవరకు అనుమానం
అరచేతుల్లో ప్రాణం
విను రామన్న!
పండ్లలో రాజు మామిడి
"హిమాయతే ముందు" నానుడి
అమృతానికే అది ప్యారడి
విను రామన్న!
Note: Himayat is the mango variety developed by the aristocracy of Hyderabad in the orchards near Himayat Sagar reservoir. It is known for its fabulous mellow and the spread of its aroma. It looks like the popular 'benishan' but costs two to three times more. Himayat has very thin skin and the stone inside is wafer thin. It is full of muscle and has no fiber. Its taste is indescribable. It is available in Hyderabad in the mid May and the first week of June. Best suited to send as a Gift basket to the near and dear.
అన్నదమ్ముల ప్రేమ
కాలం చెల్లిన డ్రామ
దూరముంటేనె బీమ
విను రామన్న!
వెయ్యేండ్లైనా వేరు
తప్పదు జ్ఞాతుల పోరు
వేర్పాటిపుడే కోరు
విను రామన్న !
కాలం చెల్లిన ఓదార్పు
కపటం నిండిన ఏడ్పు
వరంగలిచ్చిందే తీర్పు

గైనకాలజ రోగాలు
పుట్టిన ప్రతి జీవికి గిట్టుట అనేది ఖాయం. అసలు ఏ ప్రాణీ జన్మ మృత్యు జరా వ్యాధుల్ని తప్పించుకోలేదు. ప్రతి శరీరము అది ఏనుగులాంటి భారీ కాయమైనా ఒక సూక్ష్మజీవైనా చివరికి శరీరాన్ని వదలవలసిందే. పుట్టడం చావడం ఇవి మన కళ్ళకు కనిపించే సత్యాలు. పుట్టుకకు ముందు ఏమైనా ఉండేదా లేకపోతె మనం పుట్టిన రోజే మన కర్మల ఖాతా మొదలైందా, చచ్చిన తర్వాత ఏమైనా మిగిలి ఉండి, మన బ్యాంక్ ఖాతామాదిరి పాతపాస్ బుక్ పూర్తి అయిన తర్వాత కొత్త పాస్ బుక్ పాత బ్యాలన్స్ తో మళ్ళీ మొదలౌతుందా అనేది వేదాంతపరంగా జిజ్ఞాసువైన మనిషి అడిగే మొదటి ప్రశ్న. శరీరము , శరీరధారి (body and owner of the body) అనేవి రెండు విషయాలా లేక అంతా కలిసి ఒకటేనా అనేది కూడా మొదటి ప్రశ్నకే అనుబంధ ప్రశ్న. "నా ఇల్లు" అన్నప్పుడు ఇక్కడ రెండు వస్తువులు గోచరిస్తాయి. ఒకటి నేను, మరొకటి ఇల్లు. నేను వేరు నా ఇల్లు వేరు. అట్లాగే "నా శరీరం" అన్నప్పుడు కూడా నేను వేరు నా శరీరం వేరు. చాల సులువుగా చిన్నపిల్లలకైన అర్థమయ్యే తులనాత్మక వివరణ (analogy) ఇది. నాకు బాగా అర్థం అయ్యేదీ నేను ఎదుటివారిని ఒప్పించగలిగేది ఈ స్పష్టమైన విషయము.
అసలు నేను చెప్పాల్సిన విషయమేమిటంటే ఈ జనన మరణ సత్యాల మధ్య జరా అంటే ముసలితనం వ్యాధి అంటే రోగం చాల బాధాకర పరిణామాలు. సాధారణంగా వీటిని దాటిన తర్వాతే శరీరధారులకు మృత్యువు రూపంలో ముక్తి లభిస్తుంది. ఎంత గొప్పయోగి ఆయినా భోగి అయిన ఒకానొకప్పుడు రోగి కావలసిందే. మహా యోగులకు రోగాలు రాకపోవొచ్చు కాని ప్రమాదాలు తప్పవు కదా. స్త్రీలు, పురుషులు, పిల్లలూ అందరూ రోగాల బారిన పడతారు. అయితే మహిళలకు మగవారికుండే రోగాలు, ఇంకా స్త్రీల శరీర ప్రకృతికి సంబంధిచిన విశేష రుగ్మతలు ఎప్పుడూ వెంటాడు తుంటాయి. పాపం ఆడవాళ్ళు గొప్ప సహనశీలులు. వాళ్ళు సమస్యల్ని మగవారి మాదిరిగా అందరికీ విడమరిచి చెప్పనూ లేరు. ఇది ఇంకో సామాజిక సమస్య. ప్రజోత్పత్తికే కారకులైన మాతృమూర్తులను ఎన్నో మరుగు రోగాలు కాలక్రమంలో సతాయిస్తుంటాయి. ఇక స్త్రీవ్యాధుల నిపుణులకు ఈ పరిస్థితి పండగలా పరిణమించింది. ప్రతి చిన్న దానికి డాక్టర్ల దగ్గరికి పోవడం వాళ్ళు రకరకాల పరీక్షలపేరుతో భారీ ఫీసులు వసూలు చేయడం మనమందరం చూస్తూనే ఉన్నాము. అసలు కొన్ని జబ్బులకైతే ఏ మందు అవసరం ఉండదు. మన తల్లులు వాళ్ళ తల్లులు ఏ గైనకాలజిస్టు దగ్గరికి పోయారని.
ఈ మధ్య ప్రతి స్త్రీరోగానికి ఒకటే మార్గం సూచిస్తున్నారు కొందరు వైద్యులు. గర్భసంచి తొలిగించడం. ఇది ఒక పెద్ద వైద్య కుంభకోణం గా తయారయింది. మెనోపాజ్ వంటి శరీర సంబంధిత ప్రకృతి మార్పులు అనేవి కాలజాలు అంటే వయసు పెరిగేకొద్దీ సంభవించే పరిణామాలు. ఇతరత్రా ఏ సమస్యా లేనప్పుడు శరీరంలోని ఒక భాగాన్ని తీసివేయడం ఒక పెద్ద తప్పిదమే. ఈ మధ్య ప్రభుత్వంకూడా కళ్ళు తెరిచింది. గర్భసంచి తొలగించే ఆపరేషన్లు పెద్ద వ్యాపారంగా తయారైనాయని రోజు పేపర్లలో చూస్తున్నాము. కొందరు డాక్టర్ల నీచబుద్ధి వాళ్ళడిగే ప్రశ్నలతో బైటపడుతుంది. మీ వారు ఏమిపని చేస్తారు. వాళ్ళది ప్రైవేటు కంపనీయా గవర్నమెంటుదా? స్టేటా సెంటరా? ఇన్శూరన్స్ ఒస్తుందా? ఇట్లా ప్రశ్నల పరంపర తర్వాత మెల్లిగా చెప్తారు ఖర్చు ప్రొసీజరు మొదలైనవి. గత రెండు సంవత్సారలనుండి నా భార్య పడే బాధలు, వాటికోసం మేము సంప్రదించిన డాక్టర్లను బాగా అర్థం చేసుకొని వాళ్ళ అనైతిక వ్యాపార శైలికి విసిగిపోయి రాసిందే ఈ కింది పద్యం. ఇంతకన్నా ఏమిచేయగలము. దయచేసి ఓపికగా చదవండి. మీరూ నాతో ఏకీభవిస్తారు.
మహిళలందు మరుగైనకాలజ రోగాలు
మహిలోని మందులతో మాన్పలేమా? కువైద్యుల
మహిమలే అతివల సుదేహముల జీల్చ
సహనమే సంసారుల వంతు ఆయె!

Subscribe to:
Comments (Atom)