जाँ कालबाद ए सूरत ए दीवार में आवे
బిబ్బోకవతివై సభలో నువు సరససంభాషణ సల్పడం
ప్రాణంపోసుకునె, అది విని, గోడన వ్రేలాడు చిత్రపటం
बे इश्क़ उम्र कट नहीं सकती है, और याँ
ताक़त बक़द्र ए लज्ज़त ए आज़ार भी नहीं
ప్రేమలేని జీవనయానం
కొనసాగ లేదు
ఇట, మధురక్షోభ
భరించు శక్తి మాకు లేదు
मिलना तेरा अगर नहीं आसाँ, तो सह्ल है
दुश्वार तो वही है के दुश्वार भी नहीं
నీ సంగమం సులభం కాకపోయినా
సులువైనదే
అసలు కష్టం-
మన కలయిక దుష్కరం కూడా కాదు
रंज से क़ुगार हुआ इंसान, तो मिट जाता है रंज
मुश्किलें मुझ पर पड़ी इतनी के आसाँ हो गई
దు:ఖాలకలవాటుపడితే
సమసిపోతుంది దు:ఖం
కష్టాలెన్ని విరుచుకుపడ్డాయో నాపై
యాతనలయ్యాయి సుగమం
दिल को नियाज़ ए हसरत ए दीदार कर चुके
देखा तो हम में ताक़त ए दीदार भी नहीं
నీ దర్శన లాలసలో
అర్పించాను నా హృదయం
తీరా చూస్తే, మృగ్యమైంది
మాయందు వీక్షించే బలం
हम मुअह्हिद हैं हमारा केश है तर्क ए रुसूम
मिल्लतें जब मिट गयी तो अज्ज़ा ए ईमाँ हो गाईं
మేమేకేశ్వరోపాసకులం,
ఛాందసకర్మల త్యజనమే మా మతం
ఈ విశ్వాసమే నిలిచింది అఖండం
అన్య గతులన్నీఇక ఖతం
मै चमन में क्या गया, गोया दबिस्ताँ खुल गया
बुलबुले सुनकर मेरे नाले, गज़लख्वा हो गईं
తోటలో నేనడుగు వేయడం తో
పులకరించినట్లయ్యింది 'పాట'శాలలో గోల
బుల్బుల్ పక్షులు నా రోదన విని
అందుకున్నాయి గజల్ గానహేల
आह को चाहिए इक उम्र असर होने तक
कौन जीता है तेरे ज़ुल्फ़ के सर होने तक
ఉద్విగ్నమది నిట్టూర్పుకు
జీవితకాలం పట్టు నిను చేరువరకు
ఎవడు మనగలడు
నీ కురులు సిగ పెనవేయు వరకు
ज़बान ए अहल ए ज़बां में है मर्ग क़ामोशी
यह बात बज़्म में रौशन हुई ज़बानि शमा
భావమెరిగినవారి భాసయందు
నిశ్శబ్దం నిధనమేనట
నిండు సభయందు వెలిగిందీసత్యం
జ్వలించే జ్యోతి నోట
जू ए खून आँखों से बहने दो, के है शाम ए फ़िराक़
मैं समझूंगा के शम्मा दो फुरोजाँ गो गाई
ఇది విరహసంధ్య
కళ్ళనుండి పారనివ్వు రక్తధారలు
జ్యోతిద్వయం
వెదజల్లినట్లు కాంతిచారలు
दाइम पड़ा हुआ तेरे दर पे नहीं हूँ मैं
ख़ाक ऐसी ज़िंदगी पे के पत्थर नहीं हूँ मैं
నీ ఇంటివాకిట శిలనైనా కాను
ఈ బ్రతుకెంత వ్యర్థమో
పాదస్పర్శయినా మిగిలేది నిత్యం,
నాదెంత దౌర్భాగ్యమో
हैं और भी दुनिया में सुखनवर भहत अच्छे
कहते हैं के ग़ालिब का है अंदाज़ ए बयान और
కలరెందరో కవులు
జగతిలో సుకవులు
ఐనా, గాలిబ్ కథనశైలే వేరని
వివరింతురు విదులు
दिले नादाँ तुझे हुआ क्या है आखिर इस दर्द की दवा क्या है
हम को उनसे वफ़ा की है उम्मीद जो नहीं जानते वफ़ा क्या है.
ఏమైందో నీకు,
మాయలెరుగని మనసా
విశ్వాసమంటే ఎరుగని వారిని
విశ్వసించడమే నీ గోస
नुकतह-चीं है, ग़म-ए दिल उस को सुनाए न बने
कया बने बात जहां बात बनाए न बने
దోషమెంచడమే ఆమె పని
మనోవ్యథ వినిపించుకోదెంత చెప్పినా
ఆశలు నెరవేరునెట్లో, అచట
ఫలితం శూన్యం హృదినెంత విప్పినా
इशक़ पर ज़ोर नहीं है यह वह आतिश ग़ालिब
कि लगाए न लगे और बुझाए न बने
ప్రేమపై అధికారమొప్పదు
ప్రేమ నిప్పు లాంటిది
రగిలిస్తే రగలనిది
రగిలితే మరి ఆరిపోనిది
मैं बुलाता तो हूं उस को मगर अय जज़बह-ए दिल
उस पह बन जाए कुछ ऐसी कि बिन आए न बने
అయినా ఓ సంగమకాముక !
పారాలి ఆమెపై మాయేదో,
అయ్యేను తప్పని అభిసారిక
ग़ैर फिरता है लिये यूं तिरे ख़त को कि अगर
कोई पूछे कि यह कया है तो छुपाए न बने
తిరిగేరు పట్టుకుని
నీ ఉత్తరం పరులు
అదేమనడిగితే
దాచలేరు మరులు
इस नज़ाकत का बुरा हो वह भले हैं तो कया
हाथ आवें तो उंहें हाथ लगाए न बने
ఆమె లావణ్యం ఆమెకే చెల్లు
ఆమె సౌశీల్యం వల్ల మాకేమి ఒరుగు
ప్రేయసి మా చేతచిక్కినా
సంగమభాగ్యమెలా కలుగు?
స్వరక్తసిక్తమైన లక్ష కోరికల్ని
నా మౌనం దాచేసింది
ఒక అపరిచితుని సమాధిపై
జిహ్వలేని దగ్ధజ్యోతినయ్యాను
ఆమె కనుపక్ష్మలు రగుల్చు
తీక్ష్ణవేదననేమాటలు వర్ణించగలవు
నా రక్తబింధువులు జపమాలలో
పగడం పూసలయ్యాయి