కావ్-కావె సఖ్త్-జానీ హా'ఏ తన్హా'ఈ న పూఛ్
సుభ కర్నా షామ్ కా లానా హై జూ-ఎ-షీర్ కా
ఏకాంతపు మొండిబతుకు,
గుండెనెలా తొలిచెనో అడగకు నను ;
రేయి గడిపి పొద్దు చూడడం -
అవనికి మందాకిని దించినట్టే, విను.
కావ్-కావ్ = త్రవ్వడం, తొలచడం; సఖ్త్-జానీ = మొండి బతుకు ; తన్హా'ఈ = ఏకాంతం; జూ-ఎ-షీర్ =క్షీరనది.
సుభ కర్నా షామ్ కా లానా హై జూ-ఎ-షీర్ కా
ఏకాంతపు మొండిబతుకు,
గుండెనెలా తొలిచెనో అడగకు నను ;
రేయి గడిపి పొద్దు చూడడం -
అవనికి మందాకిని దించినట్టే, విను.
కావ్-కావ్ = త్రవ్వడం, తొలచడం; సఖ్త్-జానీ = మొండి బతుకు ; తన్హా'ఈ = ఏకాంతం; జూ-ఎ-షీర్ =క్షీరనది.
హం నషీన్, మత్ కహ్నా కె బర్హం కర్ న బజ్మె-ఇష్కె-దోస్త్
వా తో మేరె నాలే కో భీ అ'ఇతెబారె-నఘ్మ హై
మిత్రమా! ప్రియురాలి ప్రణయగోష్ఠిలో
రభస వలదని వారించకు నను ;
రభస వలదని వారించకు నను ;
నా శోకమైనా సరే
కమ్మని పాటలా వినిపించు నచట, విను
కమ్మని పాటలా వినిపించు నచట, విను
ఎక్ హంగామే పె మౌఖూఫ్ హై ఘర్ కీ రౌనఖ్ నౌహ-ఎ-ఘమ్ హీ సహీ, నఘ్మ-ఎ-షాదీ న సహీ
ఒక కోలాహలం పై
ఆధారపడి ఉంది ఇంటి శోభ;
శోకవిలాపమైనా సరే,
ఆనందగీతి కాకపోయినా సరే.
హంగామ=కోలాహలం; మౌఖూఫ్=ఆధారితం; రౌనఖ్ =శోభ ; నౌహ = విలాపం; ఘమ్ = శోకం; నఘ్మ = గీతం ; షాదీ = ఆనంద, హర్షాతిరేకం ; సహీ = సరి.