بھوکے نہیں ہیں سیر گلستان کے ہم ولے
کیوں کرنہ کھائیے کہ ہوا ہے بہار کی
భూకే నహీ( హై( సైర్ గులిస్తాన్ కె హం, వలె
క్యూ( కర్ న ఖాయే కె హవా హై బహార్ కీ
పుష్పవాటికల్లో విహరించడం
మాకు లేదు అంత ఆరాటం, కాని
ఆమనిగాలులననుభవించడం
మేమెందుకు కాదనడం
భగవంతుడు ప్రసాదించిన లెక్కలేనన్ని భోగ్య ఆనందాల కోసమే అర్రులుజాచి జీవించడం అంత ఆదర్శవంతమైన విషయం కాదు. కాని, ప్రకృతి అందించే అందాలను ఆస్వాదించక పోవడం కూడా, దైవకృపను తిరస్కరించినట్టే అవుతుంది. మాకు ఆరాటం లేదు అంటూనే, ఎందుకు కాదనడం అనడం ఒక గమ్మత్తు.
కోరికలన్నీ అందమైనవి అనుభవించ దగ్గవి. కొన్ని తీరినప్పటికీ అన్ని తీరకపోయాయని బాధ.
No comments:
Post a Comment