Friday, February 25, 2011

భవననిర్మాణము-స్వాస్థ్యనిర్యాణము

కాలనీ నడిమధ్య సౌధమొకడు నిర్మించ, ఆ
బాలగోపాలము విహ్వలించె ; సుత్తి మో
తలు నిత్యబిభీషికలాయె రక్తచాపమెచ్చి రోషమెగిసె,
తలలన్నితమ ఘోష వినిపించి వేసారె
ఠావుల్దప్పె ప్రాణముల్!

Friday, February 18, 2011

జీవితం ఒక ఉత్సవం

తోచింది నిసిలోన
నిలిచింది నాయందు
వ్యసనమై,
దోచింది కాదు నా కవనం;
అనుభవాలు ప్రభావాలు
సంధించి ఘోషించ
యతిప్రాసలలొల్లి వల్లించలేను ,
విధురకలలకల్లోలిని యిది
మధువనుకొని విను రామన్న!



అనుకంపలేని కవిత
మనువాడని మనిషి అనుభవసూక్తి

తనుమధ్యమగాని గణికామణియును
అనువుగానివవి విను రామన్న!

కవిగానివాడు కావ్యము వ్రాసిన
భువి యంతయు వాని బుద్ధికి మెచ్చెన్; సుకవితా
చవి తెలిసిన ప్రాజ్ఞుని లోకులు గానరు -
అవివేకులకు విచక్షణేది? విను రామన్న!



జీవితం ఒక ఉత్సవం
ఆనందాంబుధికి తత్సమం
ఇది స్నేహకారుణ్య వేదిత్వం
సత్యాన్వేషణ నా కవిత్వం

మనసున్న మల్లెలలో మన్మథుడను
గుబాళించే గులాబీలలో నవాబును
వ్యథలు లేని కథలలో నాయకుణ్ణి
మతములేని వేదాంతం లో వైరాగిని