Wednesday, December 28, 2011

జీవన్మరణాల మధ్య భేదముండదు, (commentary)

జీవన్మరణాల మధ్య భేదముండదు,
ఇది
ప్రణయప్రయాణం
వారినే స్మరిస్తూ బ్రతకాలి
నిర్దయి కోసం వదిలామో ప్రాణం

ప్రేమ అనేది ఒక మానసిక వికారమని, కామమని ఇదివరకే ఒప్పుకున్నాడు గాలిబ్.  ప్రేమ అని పిలవబడే ఈ కామవ్యవహారంలో జీవన్మరణాల మధ్య భేదముండదంటున్నాడు. వల్లమాలిన ప్రేమపిచ్చిలో అవతలి వారు ఎంత సాధించి వేధించినా వారిపైనే సర్వం ధారపోసి గౌరవమర్యాదలు సైతం  కోల్పోయిన వ్యక్తులు లోకంలో తారస పడుతుంటారు. రెండవ పాదంలో చెప్పిన ఉపపత్తి మనను సుందర కాండ వైపు నిర్దేశిస్తోంది.  వాల్మీకి ఈ విషయాన్నే మరో విధంగా వర్ణించాడు. "వామః కామో మనుష్యాణాం యస్మిన్ కిల నిబధ్యతే,  జనే తస్మిన్స్త్వనుక్రోశః స్నేహశ్చ కిల జాయతే."  (మనుష్యులకు కామము దుష్టమైనది,  ఎవరియందు బంధించబడతారో వారిపట్లే దయా, స్నేహాలు  పుట్టుకొస్తాయి)
 

Thursday, December 22, 2011

జీవితమనే రౌతు improvement

  దౌడులో నున్నది జీవితమనే రౌతు
చూడాలి ఎలా తగ్గునో ఆ జోరు
చేత నియంత్రించే పగ్గం లేదు
రికాబులో మా పాదం  లేదు

జీవిత ప్రయాణంపై తనకు ఏ మాత్రం  నియంత్రణ లేదని, ఎట్లా ఎక్కడ జీవనయానం ప్రశమనం, పరిసమాప్తి పొందుతుందో వేచి చూడాల్సిందేనని  నిస్సహాయతను వెళ్ళబోసుకుంటున్నాడు.
.

విశ్వాసం నను వారించె

ఈమా( ముఝె రోకే హై జొ కీ(చే హై ముఝె  కుఫ్ర్
కా'బా మెరె  పీఛే హై కలీసా మెరె  ఆగె

విశ్వాసం నను వారించె
సంశయం నను వలచె;

అల్లాగేహం నా వెనక  నిలిచె
క్రీస్తుదేహం నను రమ్మని పిలిచె 

ఈ కవితకు వాచ్యార్థం చాల స్పష్టం.  కాని ఇందులో ఉన్నది ప్రతీకాత్మకంగా చెప్పిన గంభీరమైన వ్యంగ్యార్థం. మక్కాలోని అల్లాగృహం (ఖాన-ఎ-ఖుదా, కా'బకు)  చేరువలో కలీసా (చర్చి) లేనేలేదు. కా'బ, కలీసాలు సాంకేతికంగా వాడబడిన  ప్రతీకలు మాత్రమే.  ఇంతకుముందే చెప్పుకున్నట్టు గాలిబ్ ఒక తిరుగుబాటువ్యక్తిత్వం గల అభ్యుదయవాది, మానవతావాది. కా'బ అంటే అతనెరిగిన (భూస్వామ్య) వ్యవస్థగా,            కలీసాను అభ్యుదయవాదానికి ప్రతీకగా అన్వయించుకోవాలి. ఛాందస మతవిశ్వాసాలను నిరసించి ఆధునిక సర్వాభ్యుదయం వైపు ఆకర్షితుడయ్యాడు. గాలిబ్ ఎంత భావస్వతంత్రుడో ఈ షేర్ ధ్రువపరుస్తున్నది.

Tuesday, December 20, 2011

అద్దమెందుకు నేనివ్వొద్దు

ఆ'ఈన క్యూ( న దూకె తమాషా కహే(  జిసే
ఐసా  కహా( సె లాఊ కె తుఝ్సా  కహే( జిసే


అద్దమెందుకు నేనివ్వొద్దు
నీ సొగసుహొయలు చూపేందుకు
వేరే అందం నా కెచట చిక్కు
నీకు సాటి అని చెప్పేందుకు

నాయికాసౌందర్యవిలాసవర్ణన భావుకుడైన  రసజ్ఞకవికి గొప్ప అవకాశం. అతి సామాన్య శబ్దప్రయోగంతో అసామాన్య భావచిత్రణ ఈ కవితలో ఉంది.  వాల్మీకిని తలపిస్తున్నదనడంలో నాకే సంశయము లేదు.  "త్వాం కృత్వోపరతో మన్యే రూపకర్తా స విశ్వకృత్, న హి రూపోపమా త్వన్యా తవాస్తి ప్రియదర్శనే"  నిన్ను సృష్టించి ఓ ప్రియదర్శనా, సీతా!  రూపకర్త అయిన  ఆ బ్రహ్మదేవుడు తన పని విరమించుకున్నాడనుకుంటాను; నీతో సరితూగే సౌందర్యవతి ఎక్కడా లేదు లోకంలో కనుక. (సు.కాండ)ప్రియురాలి అందం అనుత్తమమైనది, అనుపమానమైనది. ఆమె సౌందర్యానికి ఆమే సాటి, పోటి, మేటి.  తత్తుల్యమైన అన్య సౌష్టవ విలాసాన్ని ఒక ఆదర్శం మాత్రమే ప్రతిబింబరూపంగా సృష్టించగలదు.  ఇదొక హృద్యమైన కల్పన.




Sunday, December 18, 2011

tadeeyulam memu maakemi takkuva (improvement)

సాధకుడు  తన సత్స్వరూప జ్ఞానం పొందిన పిదప అనుభవించే స్థితి ఇది. 'అహం బ్రహ్మాస్మి', 'అన అల్ హఖ్', 'అనఅల్ బహర్' వంటి వాక్యాలన్నీ ఆత్మసాక్షాత్కారం పొందిన సాధకుని తత్త్వదర్శన నిదర్శనాలు.  భగవంతుని  సన్నిధి చేరిన   భక్తులకు, ప్రియురాలి మెప్పు పొందిన ప్రేమికులకు ఏమి  తక్కువ. తదీయులం మేము, "హం ఉస్కే హై( " ఇది బిందువు సింధువుతో తాదాత్మ్యము పొందిన స్థితి.  సకల ఇహపర సౌభాగ్యాలు వాళ్ళ కాళ్ళ కిందే ఉంటాయి.

sangamasoubhaagyam (improvement)

 కలవడం నిను సులభం కాకపొతే,
మరి నాకది సులువే;
అసలు కష్టం  
నీ కలయిక కాదు దుష్కరం 

గాలిబ్ చెప్పడమేమంటే, ఆమె  సంగమాన్ని పొందడం ఇతరులకు సులభం కాకపోవొచ్చు.  నిజమే. ఆ పరిస్థితి తనకు ఎంతో దోహదపడుతుందని, కాబట్టి, తనకు మాత్రం పోటీ లేకపోవడంచేత ఆమెను సాధించడం సులువైనపనే అని. 

Saturday, December 17, 2011

durbalavasanam


ఎవ్వని రచనావిలాసకేళిపై
చిత్తరువు ఫిర్యాదు జేసె
జగతి పటములోని ప్రతి ఆకృతి
దుర్బలవసనం మోసె






     
ముఝ్ కో దయారె ఘైర్ మే మారా వతన్ సే దూర్
రఖ్ లీ మెరే ఖుదా నే మెరీ బేకసీ కీ షరం

మాతృభూమి నుండి దూరంగా
తీశావు నా ప్రాణాలు పరదేశంలో
పరువు కాపాడె నా దేవుడు
దైన్యం కలిగించిన పరిస్థితిలో

Friday, December 16, 2011

svargaveethi

స్వర్గం కూడా తన ప్రియురాలి వీథి మాదిరే దేదీప్యమానమై ఉందట. అంటే, ఆమె వీథివైభోగం స్వర్గ వైభావానికేమీ తీసిపోదు. ప్రియురాలు నివసించే వాడలో ఉన్న జనసందడి స్వర్గంలో ఉండదు. కాబట్టి తన ప్రేయసీవాసం స్వర్గాసీమకంటే ఉత్కృష్ట మైనదట.

Monday, December 12, 2011

అద్వితీయం అతని ఏకత్వం

ఉసే కౌన్ దేఖ్ సక్తా కె యగాన హై వొ యక్తా
జో దుఈ కి బూ భీ హోతీ తొ కహీఁ దో చార్ న హోతా




ఎవడు దర్శించగలడు వాణ్ణి,
అద్వితీయం వాని  ఏకత్వం

కాకపోవునా ముఖాముఖి,
గంధమోలె ఉన్నా ద్వితీయం




పరమసత్యం అద్వితీయమైనది, అంటే ఈశ్వరుడు కేవలుడు, ఒకేఒక్కడు అతనికి ప్రతిశక్తి అనేది ఉండదు. మాయ అని పిలవబడే నకారాత్మక శక్తికూడా ఈశ్వరజనితమే. ఇది వైదిక సిద్ధాంతం. ఏకం సత్, విప్రా: బహుధా వదంతి ; ఎకమేవాద్వితీయం అనేది ఆర్షఘోష. అల్లా అద్వితీయుడు, యితడు తప్ప వేరెవరూ పూజ్యులు కారు; ఇది ఖౌరానికము. అల్లాయొక్క ఐశ్వర్య వైభవంతో పోటీ, భాగస్వామ్యం (షిర్కత్ ) ఏ ఇతర శక్తికి ఉండదు. ఇందుకు భిన్నంగా భావించడం మహాపాపం (గున-ఎ-షిర్క్). ఇది ఇస్లాం మత మూలవిశ్వాసం.  భగవంతుడు ఒక్కడే; రెండవది (దు'ఈ) గంధమాత్రమైనా  ఉన్నపక్షంలో ఎక్కడోఅక్కడ దర్శనం లభించేది,` అని  ఏకేశ్వరవాదాన్ని(తౌహీద్) తనదైన శైలిలో వివరించాడు.ఈశ్వరుడు ద్వయమై ఉండిన రెండుగా, నాలుగుగా (బహుత్వంగా) కూడా విద్యమానుడై 
ఉండేవాడని ఇంకొక అర్థం. భగవంతునివలె తన ప్రియురాలుకూడా నిరుపమానమైనదని లౌకికార్థం.

Monday, December 5, 2011

ఓ గాలిబ్! నువు ఋషివా!

గాలిబ్! నిగూఢ సూఫీవాదం
నీ విలక్షణాభివ్యక్తి;
నిను ఋషిగా కొలిచే వాళ్ళం
నువు మధువుకు చెబితే స్వస్తి.

Thursday, December 1, 2011

దారి గురుతులనిరి బుధులు
గుడి గోపుర శిలయు

Thursday, November 24, 2011

మరుభూమి సముద్రం

హోతా హై నిహాఁ గర్ద్ మెఁ సెహరా మెరె హోతే

గిస్తా హై బీన్ ఖాక్ పె దరియా మెరె హోతే

మరుభూమి, మట్టిలో
మరుగునపడు మేముండగ;
సముద్రమే
నేలరాయు
లలాటం, మా ముందర



తన వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని మరొకసారి ఆవిష్కరిస్తున్నాడు గాలిబ్.  భూమిపై ఒక ఝంఝావాతం  తాను సృష్టిస్తే, ఇసుకతూఫాన్లకు  సహజాశ్రయమైన ఎడారి ఆ ప్రచండవాయువీచి లేపిన ధూళిపర్దాలో తన అల్పత్వానికి సిగ్గుపడి దాక్కుంటుందట. గాలిబ్ సమక్షంలో సముద్రుడు కూడా, తన దౌర్బల్యాన్ని ప్రదర్శిస్తూ తల భూమిపై గుద్దుకున్నట్టే ఉందట. సముద్రకెరటాల అలుపెరుగని ఆరాటాన్ని, నుదురు నేలరాయడమనడం ద్రష్టకాని సామాన్య రాతగానికి తరముగాని అహంభావ ప్రదర్శన.
























Tuesday, November 22, 2011

పాపకర్మల గణన

ఆతా హై దాఘె హస్రతె దిల్ క షుమార్ యాద్




ముఝ్ సె మెరే గునః కా హైఖుదా ! హిసాబ్ న మాంగ్





గుండెను గుచ్చిన గాయాల గణన
గుర్తుకొస్తోంది విను
ఇక నా పాపకర్మలు, ప్రభో!
వాటి లెక్కలు అడగకు నను








తను చేసిన తప్పుడుపనులు అందుకు అనుభవించిన యాతనలు గాలిబ్ దృష్టిలో సరిపోయి ఉండాలి లేక, పొందిన శిక్షల పరిమాణం చేసిన కుకర్మల కన్నా ఎక్కువయి ఉండాలి. కాబట్టి ఇక పాపపుణ్యాల చిట్టా వెతకాల్సిన పని లేదంటున్నాడు. ఈ కవితలో ఒక తుంటరితనం దాగి ఉంది. పాపపుణ్యాలు, వాటిద్వారా పొందిన ఫలాలు సరిపోయాయని అంటూనే, ఇంకా ఎక్కడి లెక్కలు? కృతకర్మలకన్నా అనుభవించిన గాయాలే ఎక్కువయ్యాయని విధాతనే ఎదిరిస్తున్నాడు.

క'బా యాత్ర-హిందూస్తాన్

కా'బే మెఁ జా రహా తో న దో తా'న, క్యా కహీఁ
భూలా హూఁ హఖె-సుహ్బతె-అహ్లె-కునిష్త్ కో

కాబాయాత్రలో నేనుంటే
ఎత్తిపొడవకండి నను
దేవళప్రజల సాంగత్యసత్యం
విస్మరింతునా నేను

గాలిబ్ మనసెటువంటిదో ఎంత ఉత్తమ శ్రేణి మానవతా వాదో ఈ షేర్లో తేటతెల్లమౌతున్నది. ముస్లింల తీర్థయాత్రాస్థలి, కా'బా ను (అరేబియాలో) దర్శించి అక్కడ మకాం వేసినంత మాత్రాన, విగ్రహారాధకులైన హిందుస్తానీ ప్రజలతో తనకున్న సాంగత్య సత్యాన్ని (మైత్రిని) మరచిపోయే ప్రసక్తే లేదంటున్నాడు. సాధారణంగా హజ్ యాత్ర చేసివచ్చిన ముస్లింలు హాజీలుగా మారి తమ దైనందిన జీవన శైలిలో మార్పులు, చేర్పులు చేసుకుంటారు. విగ్రహారాధకుల సాంగత్యాన్ని నిరసించడం కూడా అందులో భాగమే. కునిష్త్=విగ్రహమున్నదేవాలయము

Monday, November 21, 2011

స్వకర్మ ఫలం

గాలిబ్ కుఛ్ అప్నీ స'ఈ సె లెహ్నా నహీఁ ముఝే
ఖిర్మన్ జలే అగర్ మలఖ్ న ఖా'ఏ కిష్త్ కో


స్వయంకృషివల్ల గాలిబ్!
నాకుండదు కించిల్లాభం

అగ్గిపాలయ్యేను ధాన్యం
దాడి చేయకపోతే శలభం


తన అదృష్ట రాహిత్యం గురించి చెప్పుకున్న షేర్ ఇది. తానూ స్వతహాగా చేసే ప్రయత్నాలు శుభ ఫలితాలు ఇవ్వవని వాపోతున్నాడు. దురదృష్టం ఎలా వెంటాడుతుందో చక్కని ఉపమానంతో వర్ణించాడు.






Saturday, November 19, 2011

నాదీ మనసే ! Improvement

నాదీ మనసే! రాయీరప్ప కాదు కదా
వెతలకెందుకు మరి వేసారదు

ఎన్నో మార్లు విలాపిస్తాను
ఎవరెందుకు నను వేధిస్తారు

Sunday, November 6, 2011

పె నె హొ తె
గే చచే చ్చె దారి గురుతులనిరి బుధులు

హ్రస్వ దీర్ఘాలు

ఉర్దూ స్వరాల (అచ్చులు, vowels) గురించి ఒక మాట. దేవనాగరిలో , లకు హ్రస్వాలు (పొట్టి అచ్చులు, shorts) లేవు; కేవలం దీర్ఘాలే. ఉర్దూ లోని , హ్రస్వాలను హిందీ వాళ్ళు దీర్ఘరూపం లోనే రాయగలరు. ఉర్దూలో అచ్చుల వాడుక చాల తక్కువ. దీర్ఘానికి మాత్రమే స్వరాలు జోడిస్తారు. హ్రస్వాలకు ఉన్నకొన్ని గుర్తులు కూడా వాడరు. పదముయొక్క శాబ్దిక స్వరూపంతో పరిచయముంటేనే సరియైన ఉచ్చారణ సాధ్యం. 'కుత్త' ను 'కత్త' గా చదివే ప్రమాదముంది. ఉర్దూను దేవనాగరిలో రాస్తే లను హ్రస్వరూపాలుగా (పొట్టిగా) పలికించడం సాధ్యం కాదు. కాని తెలుగులో ఈ సమస్య లేదు. ఉర్దూ షేర్లు తెలుగులో లిప్యంతరం చేసినపుడు చాలా జాగ్రత్తగా హ్రస్వ దీర్ఘాలను గుర్తించి రాయడమైనది. పాఠకులు గమనించాల్సిన ముఖ్య విషయమిది.
ఇంకొక ముఖ్య ఉర్దూ అక్షరం గురించి తెలుసుకోవాలి. అది 'ఐన్'. ఆకారానికి వాడే 'అలిఫ్' లానే ఉచ్చరించాలి. ఎక్కడ ఎప్పుడు ఈ 'ఐన్' ప్రయోగిస్తారో ఖచ్చితంగా చెప్పడం కష్టం. ఇంగ్లీష్ లో స్పెల్లింగ్ మాదిరి. తెలుగులోకి 'ఐన్' రూపాంతరం చేసినపుడు (') గుర్తుతో చూపబడింది. ఈ అచ్చు ఒక పదము మొదట్లో మధ్యలో చివరలో కూడా వాడబడుతుంది. ఉదాహరణ: 'ఇష్ఖ్ , కా'బ, షమ',





తెరేe తెరే తెరె మెఁ కొ మెరీ తెరా సె నె జొ

Saturday, November 5, 2011

s tఏరే n నె కె సె మెఁ మెరె తెర తెరా జొ కి తొ కొం కొ పె మొ ఆయె దొ


ప్రేమ తెచ్చిపెట్టే  బాధలనుభావించడానికి సిద్ధంగా ఉన్నాడు. తప్పించుకునే స్వభావం కాదు.  హయూల=పుండుకు ముందు కనబడే మొన.

Friday, November 4, 2011

శిఖరారోహణం

ఘర్ర: ఎ ఆఉజె బినా-ఎ ఆలమె-ఇమ్కాఁ న హో
ఇస్ బులందీ కె నసీబోఁ మెఁ హై పస్తీ, ఏక్ దిన్

ఉన్నతశిఖరాలధిరోహించి
గర్వపడకు, అది అనిశ్చితం
పతనం ధ్రువం ఒక దినం,
ఇది ఆరోహణలో లిఖితం




ఘర్ర:=గర్వం; అ'ఉజ్ =ఉన్నత శిఖరం, ఆరోహణం; ఇమ్కాన్=అనిశ్చితి; పస్తీ-పతనం

Saturday, October 29, 2011

ఉర్దూ హల్లుల ఉచ్చారణ సూచీ

ఉర్దూ హల్లుల ఉచ్చారణ సూచిక

ఫార్సీ, అరబ్బీ పదాలను విరివిగా ఉపయోగించుకునే ఉర్దూ భాషలోని వ్యంజనాలను (consonant) భారతీయ భాషల్లో పలికించడం కష్టమే. స్వరాలతో (అచ్చులు) పెద్ద ఇబ్బంది లేదు. అయితే, ఒక విశేషమైన గుర్తు వాడి ఆ అక్షరాలను ఉచ్చరించడం సులభమే. కొంత అభ్యాసం కావాలి. అలా గుర్తించి చదివినప్పుడే ఉర్దూ కవితలు విన సొంపుగా శ్రావ్యంగా అర్థవంతంగా ఉంటాయి.
మనకు సర్వసాధారణంగా ఉర్దూ సాహిత్యంలో తారసపడే అభారతీయ (non-Indian) హల్లులు ఇవి: ख़ , ग़ (), , జ फ़హిందీ వాళ్ళు చక్కగా అక్షరం కింద ఒక చుక్క పెట్టుకొని ఫార్సీ/అరబ్బీ శబ్దాలను వేరుగా గుర్తించి చదువుతున్నారు. మనకు అలాంటి సౌకర్యం లేదు. చాల ప్రయత్నం చేశాను. అక్షరం కింద చుక్క సాధ్యం కాలేదు. కాబట్టి ఒక చిన్న గీతతో (underline) తో ఇలాంటి అక్షరాలను గుర్తించే నియమం ఈ పుస్తకంలో చేయబడింది. వాక్శుద్ధి లేక భాష, సాహిత్యంతో పరిచయంలేక గజల్ ను గజల్ అని ఉచ్చరించి ఉర్దూ భాషకు క్షమించరాని అన్యాయం చేస్తూ గొప్ప గాయకులుగా (గంధర్వులుగా)చలామణి అవుతూ ప్రశంసలు, పారితోషికాలు దోచుకున్న, దోచుకుంటున్న మూర్ఖులను ఏమని పిలవాలో అర్థం కావడం లేదు.

ఉచ్చరించే పధ్ధతి:

ఖ = ఈ శబ్దం గొంతు చివరనుండి ధ్వనించవలె. తెలుగు ఒత్తు 'ఖ' గొంతు (కంఠ్యం) చివరి నుండి . ఉదా: ఖతం, ఖబర్, ఖుదా
ఘ & గ = ఇవి కూడా పై దానివలెనే(కంఠ్యం) కాని 'ఘ' గొంతు చివరి నుండి పుట్టించవలె. ఉదా: గాలిబ్, గజల్ , ఘమ్, ఘలత్
జ = ఇది ఇంగ్లీష్ Z లా ధ్వనించే హల్లు. ఉదా: జమాన, జిందగీ, జనానా
ఫ = ఇది ఇంగ్లీష్ F లా ధ్వనించే హల్లు. ఉదా: ఫలక్, వఫా, ఫాయెద

ఉర్దూ గజల్లు విని ఆనందిచే వారికి ఇక్కడ వాడిన పధ్ధతి అతి సులభంగా అర్థమౌతుంది.


గాలిబ్ కు ఫార్సీ భాషతో అమితమైన అనురాగం. ఆయన ఉభయభాషా ప్రవీణుడు. అయినా ఆయనకు ఉర్దూ కన్నా ఫార్సీలో కవిత చెప్పడమే ఇష్టం. కవిత్వానికి ఫార్సీయే సరియైన మాధ్యమమని నమ్మేవాడు. ఉర్దూలో కవిత చెప్పాల్సి వచ్చినందుకు మథనపడ్డాడు. ఉర్దూ కవితను కేవలం సామాన్య రసికబాహుళ్యం కోసమే సృష్టించాడట. తన అసలు కవిత్వామ్నాయమంతా ఫార్సీ కవితల్లోనే ఉందని, అక్కడే తన విద్వద్విశ్వరూపమంతా ఉందని చెప్పుకున్నాడు.

Sunday, October 2, 2011

నీ మాట నమ్మిన జీవితం

తెరే వాదె పర్ జియే హమ్ తో ఏ జాన్ ఝాట్ జానా
కె ఖుషీ సె మర్ న జాతే అగర్ ఏత్బార్ హోతా

నీ మాటనమ్మి నే జీవించడం,
తెలుసుకో ఇది అసత్యమేనని నాకెరుక
సంతోషంలో చావక పోదునా
నీ మాట పై ఉంటే నాకు నమ్మిక

Thursday, September 29, 2011

ఆటస్తలి ఈ ప్రపంచం

బాజీచ-ఎ-అత్ఫాల్ హై దునియా మెరే ఆగే
హోతా హై షబ్-ఓ-రోజ్ తమాషా మెరే ఆగే

చిన్నారుల ఆటస్థలం యీ ప్రపంచం నా దృష్టిలో
రేయింబవళ్ళు సాగునీ నాటకం యీ సృష్టిలో

Monday, September 26, 2011

అవని యవనికలో improvement

శర్మ్-ఎ-రుస్వాఈ సే జా చుప్నా నఖాబ్-ఎ-ఖాక్ మేఁ
ఖతం హై ఉల్ఫత్ కి తుఝ్ పర్ పర్దాదారీ హాయ్ హాయ్



అవనియవనికలో నువ్విలా 
 అవమాన వ్రీడతో దాగడం 
అయ్యో! పరాకాష్ట నొందె నీతో  
యీమదనప్రేరిత దాపరికం


కహాఁ మైఖానేఁ క దర్వాజ గాలిబ్! ఔర్ కహాఁ వాయిజ్
పర్ ఇత్నా జాన్తే హై, కల్ వో జాతాతా కె హం నిక్లే
ఎక్కడ మధుశాల ద్వారం, ఎక్కడ మన స్వాములవారు
నిన్న నే బయటికి రాగా, ఇది నిజం, వారు లోనికెళ్ళారు

Saturday, September 24, 2011

An Introductiion to Gaalib

అసదుల్లః ఖాన్ గాలిబ్ గురించి బహుశ తెలియని వారుండరు మన దేశంలో. ముఖ్యంగా తెలంగాణాలో ఇంకాముఖ్యంగా హైదరాబాద్లో పుట్టి పెరిగిన వారు ఎవరైనా సరే వాళ్ళ మాతృభాష ఏదైనా సరే వారికి సాహిత్యంలో ప్రవేశంఉన్నా లేకపోయినా ఎప్పుడో ఒకప్పుడు గాలిబ్ గురించి తప్పకుండ అప్రయత్నంగానైనా వినే ఉంటారు. ఏదో ఒక కవిత గాలిబ్ దో లేకపోతె గాలిబ్ పేరున చెప్పిందో వినే ఉంటారు. అర్థం అయినా కాకపోయినా 'వాహ్ క్యా బాత్ హై' అని స్పందిచేఉంటారు. ఇది అతిశయోక్తి ఏమాత్రం కాదు. హైదరాబాద్ సంస్కృతి చాల విలక్షణమైనది. ఇక్కడివారు ఇంట్లోమాట్లాడేభాష ఏదైనాకాని వాళ్ళు ఇంటిబయట వాడుకునే 'మాట' భిన్నంగా ఉంటుంది. ఉర్దూ తో ఉన్న అనుబంధం మూలాన ఇక్కడి భాష చాలా సంపన్నమైనదనే చెప్పాలి. ఉర్దూ ద్వారా ఎన్నో తుర్కి, పార్సీ, అరబ్బీ పదాలు తెలుగు లోకి చేరిపోయాయి. సంస్కృతం తర్వాత ఉర్దూ పదాలే తెలుగులో గుర్తు పట్టలేనంతగా మిలితమైపోయాయి. ఉర్దూ క్రియారూపాలు తెలిగించబడి తెలగాణ్యుల భాషలో రకంగా మమేకం పొందాయి అనేది పరిశోధనకు సామగ్రి. ఉదాహరణకు: గుసాయిస్తున్నాడు (దూరుతున్నాడు) , సతాయిస్తున్నాడు (వేధిస్తున్నాడు) , అక్డాయిస్తున్నాడు(విర్రవీగుతున్నాడు), రొకాయిస్తున్నాడు(అడ్డువేస్తున్నాడు). ఇవన్నీ తద్భవాలయ్యాయి. అదే విధంగా ఎన్నో నామవాచకాలు కూడా తెలుగు భాష, సంస్కృతులలో అంతర్భాగామైనవి. అయితే ఒక మాట చెప్పుకోవాలి. కోస్తాలో మాట్లాడే, రాసే భాషలో కూడా, లెక్కలేనన్ని ఉర్దూ పదాలున్నాయి. అయితే వారు అవి తెలుగు పదాలే అనుకుంటారు. తెలియక వాటిని అపార్థాలు వచ్చేటట్టు ప్రయోగిస్తారు. ఉదాహరణకు, ఖూని అనే పదము. ఖూన్ అంటే రక్తము. ఖతల్/ఖూన్ అంటే హత్య. ఖాతిల్/ఖూని అంటే హంతకుడు. తెలియక, కోస్తా వారు 'ఖూని' అని హత్యకు బదులుగా వాడుకుంటారు. అట్లాగే ముద్దాయి అనే ఫార్సీ పదము. ముద్దాయి అంటే ఫిర్యాదు చేయువాడు plantiff. సినిమాల వాళ్ళు, పత్రికల వాళ్ళు పదం నిందితునికి (accused) పర్యాయ పదంగా వాడుతున్నారు. మనము వాడే చిరునామా (address) అని వాడే పదము కూడా ఫార్సీ పదమేనని కొందరికే తెలుసు. ఇంకొక విషయం. తిరుమలలోని ఎన్నో తంతులకు, అధికార కార్యక్రమాలకు నేటికీ ఫార్సీ/అరబ్బీ పదాలు వాడుతున్నారు. ఉదాహరణకు: ఇస్తాక్ఫాల్ (స్వాగతం), పేష్కర్, మిరాసిదారు ఇత్యాది.

మన పత్రికల నుండి కవితా, కావ్యాల్లోంచి సంస్కృతం ఉర్దూ పదాలు ఏరి వేస్తె మిగిలేది గందరగోళం. ఒక సారి ప్రయత్నించండి. అయితే మీకు పదము తెలుగు కాదో తెలియాలి. అప్పుడు తెలుస్తుంది మనము తెలుగు అని పిలిచే భాష రకంగా సంస్కృతం, ఉర్దూ (ఫార్సీ/అరబ్బీ/తుర్కి), భాషలతో సుసంపన్నమైయుండి తన ద్రవిడ స్వరూపానికి చాలా దూరమై యున్నదనే సత్యం. మనం ప్రస్తుతం వాడే తెలుగు, ద్రవిడ ఆస్థిపంజరంపై సంస్కృత, ఉర్దూ పదజాలంతో అలంకృత అయిన ఒక మిశ్రమభాష. ఇంత ఎందుకు చెప్పుతున్నానంటే, గాలిబ్ని తెలుగులోకి తేవాలని నేను సంకల్పం చేసినపుడు భాష స్వరూపం గూర్చి చాల ఆలోచించాను. అయినంత వరకు సంస్కృత పదముల వాడుక తగ్గేట్టు చూచాను. అది సాధ్యం కాలేదనే చెప్పాలి. గాలిబ్ లాంటి నిగూఢ, మార్మిక, దార్శనిక, చమత్కారభరితమైన కవితల్నిసంస్కృతంపై ఆధారపడకుండా అనువదించడం ఆకల్పనీయం. తెలుగుకు మాతృక ఆయిన తమిళంలో సాధ్యమేమో, నాకు తెలియదు.

దీవాన్--గాలిబ్ చదివాను. నాకు కూడా గాలిబ్ ని తర్జుమా చేయాలని కోరిక పుట్టింది. దీవాన్ అంటే ఒక కవి ప్రచురించిన తన కవితల సంపుటి (an anthology). తెలుగు సాహిత్యకారులకు గాలిబ్ సాహితీ సౌరాభాలు అంతగా చేరలేదనే నేననుకుంటాను. ఎందుకంటే, నా ఎరుకలో గాలిబ్ ని తెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేసినవారు చాలా అరుదు. యాబై ఏళ్ళక్రితం ఒక ప్రయత్నం జరిగింది. అంటే తరువాత ఎవరూ అంతగా గాలిబ్ విషయాని పట్టించుకున్నట్టు లేదు.

అసలీ గాలిబ్ ఎవరు. ఎక్కడి వాడు. అతనికి ఉర్దూ సాహిత్యంలో ఇంత ఉన్నత స్థానం ఎందుకుంది అనే ప్రశ్నలకు జవాబు చాల మందికి తెలిసే ఉంటుందని నా నమ్మకం. ప్రచార సాధనాలు, ముఖ్యంగా టెలివిషన్ ద్వారా, సినిమాల ద్వారా గాలిబ్ పరిచయమయ్యాడు. గుల్జార్ కృషి పుణ్యాన మనమందరమూ జగ్జిత్ సింగ్ నోట గాలిబ్ గజల్లు విని ఆనందిస్తాము.

గాలిబ్ పుట్టు పూర్వోత్తరాలు పక్కన పెట్టి మనం ఆయన రచనా కౌశలం గూర్చి చర్చిద్దాం.గాలిబ్ ఒక అసాధారణ వ్యక్తిత్వమున్న కవి. గాలిబ్ కవితల్లో ముఖ్యంగా శృంగార రసం ఉట్టిపడుతున్నట్టే ఉంటుంది. కాని, గాలిబ్ ది విలక్షణమయిన శైలి. ఆతను మాట్లాడినా రాసినా, బహ్వర్థాలు ధ్వనిస్తాయి. ఉర్దూ సంప్రదాయంలో కవితను రాయడం అనరు. కవిత్వం చెప్పడమనే (షేర్ కహ్నా) అంటారు. ఎందుకంటే, ఉర్దూ సాహితీ సంప్రదాయం ప్రకారం, మొదట కవి తన కవితను కవిసమ్మేళనంలో (ముషాయెరలో) వినిపిస్తాడు. అక్కడ మెప్పు పొంది, ఆ తర్వాత పుస్తక రూపంలో వస్తుంది కవిత.

వాచ్య వ్యంగ్యాలతో చదువరులను ఆకట్టుకుంటాయి గాలిబ్ షేర్లు. వాడిన ప్రతి పదము, పదబంధము భావగర్భితంగా ఉండి శ్రోతని నిలిపి ఆలోచింప చేస్తాయి. ఆయన దీవాన్ లోని మొట్టమొదటి కవితలో అర్థమే లేదని వాదించారట, సమకాలీన కవులు విమర్శకులు, అర్థం కాక. గాలిబ్ ను కొందరయితే బ్రతిమాలారు, తేలికయిన పదాలు వాడమని. కాని గాలిబ్ దేనికి ఒప్పుకోలేదు. గుండెను గుద్దే
గంభీర గాథను గరిమాన్విత వాగ్జాలంలో చెప్పే సుకవి గాలిబ్. ఆయన పదచయనశేముషీ అనన్యాదృశమని గాలిబ్-పండితుల అభిప్రాయం. సుదీర్ఘ ఫార్సీ సమాసాల ప్రయోగం గాలిబ్ కు వెన్నతో పెట్టిన విద్య, అలంకారశాస్త్రంలో ఆరితేరిన నిష్ణాతుడు. గాలిబ్ గొప్ప మానవతావాది. కవిత్వం ఒక సంవేదన, ఒక ఆవేశం. సకల దేశకాల పరిస్థితుల్లో, యిది ఉత్తమ కవిత్వానికి అనివార్యం. దు:ఖానికి ఆవేదనకు అన్యాయానికి స్పందించడం వల్లే మహాకావ్యాలు పుట్టాయి. సంవేదనాశీలతను, రక్తాన్ని ప్రతీకగా చూపి గాలిబ్ ఎలా ప్రతిష్టిస్తాడో ఈ షేర్లో పరిశీలించండి. "ధమనుల్లో పరుగెత్తడం ఏముంది అందు గొప్పతనం; కళ్ళనుండి రాలనపుడు రక్తమెట్లవును సార్థకం" .పుట్టింది పెరిగింది ముస్లిం కుటుంబంలోనే అయినా, మత ఛాందస భావాలకు ఎప్పుడూ తలొగ్గలేదు. చూడండి: "మసీదు ఛాయల్లో వెలయాలి మధుశాల కనుబొమల క్రిందే కాంక్షలు తీర్చే శ్రీశాల' ఎంత వివాదాస్పదుడో గాలిబ్. 'ఛాందస కర్మల త్యజనమే మా మతం' అంటాడు. ప్రతి ముస్లింకు అంతిమ గమ్య స్థానమయిన జన్నత్ (స్వర్గం) కూడా అక్కడి భోగభాగ్యాల ప్రలోభాలతో గాలిబ్ నమ్మిన సార్వలౌకిక దృక్పథం నుంచి అతన్ని మరల్చలేక పోయింది. కారణం, గాలిబ్ కుహన లౌకికవాది కాదు. జన్నత్ సత్యాలు అతను బాగా ఎరుగునట. "మేమెరుగుదుము జన్నత్ లోని వాస్తవాలు అయినా, మనసును సుఖపెట్టేందుకు బావుంది భావన" అని జన్నత్ ని తేలికగా తేల్చేస్తాడు.



సంభాషణ కూడా చాల రమ్యంగా శ్లేషపూరిత ఛలోక్తులతో కొనసాగించే వాడు
గాలిబ్. ఒకసారి రంజాన్ మాసం లో చివరి మొఘల్ చక్రవర్తి, బహదూర్ షా జఫర్, అడిగాడట: ఉపవాసాలన్నీ ఉన్నారా ? అని. దానికి "ఒక్కటి ఉండలేదు" అని బదులిచ్చాడట మన గాలిబ్. చక్రవర్తి ఏమర్థం చేసుకున్నాడు, ఒక్కటి మాత్రం ఉండలేకపోయాడు అని. ఆ జవాబులో శ్లేష ఉంది. ఇంకో రకంగా, అసలు ఒక్కటి కూడా ఉండలేదని ధ్వని. ఇల్లాంటివి కొల్లలు కొల్లలు గా ఉన్నాయి గాలిబ్ చమత్కార సంభాషణా సందర్భాలు.

ఆయనది
రాచరిక సంబంధాలున్న వంశవృక్షమని చెప్పుకున్నాడు.కాబట్టి, అవసాన దశవరకూ యా ఠీవిని బద్రపరచుకునేందుకు అతి దుర్బర దారిద్ర్యంలో కూడా ఆరాటపడ్డాడు. తన మర్యాదకు భంగం కలిగించే పదవులకోసం సన్మానసత్కారాలకోసం ఆయన వెంపర్లాడలేదు, పైరవీలు చేసుకోలేదు. అయితే, గాలిబ్ ని వెంటాడిన వ్యసనాల మూలాన, చాల అవమానాలకు గురయ్యాడు. చివరికి కారాగారానికి కూడా వెళ్ళాల్సి వచ్చింది.

గాలిబ్ రాసిందంతా విశ్వజనీన విషయ ప్రతిపాదనే మరోటి కాదు. ఆయనది సూఫీమార్గం. భగవంతుణ్ణి ప్రియురాలిగా/ప్రియునిగా భావించి, అట్లానే సంబోధించి యౌగిక సంబంధమేర్పరుచుకొనడమే సూఫీ వాదంలోని నిరంతర తపన. అది ఆశిక్షితులకు లౌకిక అనురాగంలానే గోచరించవచ్చు. కాని లోతుగా పరిశీలిస్తే దాదాపు ప్రతి వాక్యం లో రూఢ్యర్థం, యౌగికార్థం రెండూ నిక్షిప్తమై ఉంటాయి. తన భావాన్ని రకరకాల ఉపమానాలతో, అతిశయోక్తులతో, అందమయిన పునరుక్తులతో విభిన్న వృత్తాలలో అభివ్యక్తీకరించి ద్రష్టగా దర్శనమిచ్చే మహాకవి గాలిబ్.
గాలిబ్ మనకు ఫక్తు అద్వైతవేదాంతిలా అడుగడునా అగుపిస్తాడు. 'ద్రష్ట, దర్శనం, దర్శితం అన్నిటి మూలమొక్కటే' అంటాడు. 'బిందువుకు సింధువులో విలీనమే ఆనందం' అని ఉపనిషద్ఘోషితమయిన సాయుజ్యాన్ని ఉద్బోధిస్తాడు. వేదాంత సూత్రాలలోని ప్రథమ సూత్రాన్ని పోలిన భావంతో తన దీవాన్ ను జిజ్ఞాసతోనే ప్రారంభిస్తాడు. "ఎవ్వని విలాసకేళి" ఈ జగద్రచన అని ప్రశ్నించే జిజ్ఞాసువు గాలిబ్. చివరికి, ఈ ప్రపంచం చిన్నారుల ఆట స్థలం లాంటిదేనని, జగమంతా ఒక నాటకమని మాయావాదాన్ని వినిపిస్తాడు.

ఇంకా
ఏవేవో ఫారసీక సాహిత్య పోకడలతో ప్రయోగాలు చేస్తాడు. రెండు పాదాల ద్విపద పరిధి లోనే భావాన్ని రసాత్మకంగా చిత్రీకరించి చమత్కారంతో ముగిస్తాడు. ఆ చమత్కృతి ధ్వన్యాత్మకంగా వాచ్యార్థాంతర భావాన్ని ఆవిష్కరిస్తుంది. ప్రతి ఒక్క షేర్ (ద్విపద అయిన చమత్కవిత) స్వతంత్రంగా ఉండి, సంపూర్ణ భావాన్ని అందజేస్తుంది. షేర్ అని పిలవబడే ద్విపద మన చాటు పద్యం లాంటిదే. ఒక గజల్ లో పది వరకు షేర్లు ఉంటాయి. దేనికదే పూర్ణ భావార్థ ప్రదీపిక.

గాలిబ్ రచించిన ఉత్తరాలకు ఉర్దూ సాహిత్యంలో విశిష్ట స్థానముంది. ఉత్తరరచన అనేది ఒక నిర్దిష్టమయిన సాహితీ ప్రక్రియగా అవతరించడానికి గాలిబ్ ఉత్తరప్రత్యుత్తరాలలో వాడిన ఇదివరకెరుగని శైలి, కథనకౌశలాలె కారణమని పండితుల అభిప్రాయం. సత్కార బహుమానలకోసం కవిత చెప్పనని వెల్లడించుకొని కూడా, నవాబులను శ్రీమంతులను ఉద్దేశించి గొప్ప గొప్ప ఖసీదాలు (ప్రశంసలు) రాశాడు. పారితోషికాలు పొందాడు. మర్సియాలు (శోక గీతిక) లు రాయడంలో కూడా గాలిబ్ ది అందె వేసిన చేయి. గాలిబ్ పెంచి పోషించిన దత్త పుత్రుడు చనిపోయినపుడు రాసిన మర్సియా ఉర్దూ సాహిత్య ప్రపంచంలో ఒక అసదృశ కవనమై నిలిచిందట .

స్థూలంగా చూస్తే గాలిబ్ కేవలం సాంసారిక ప్రణయలాలస, తన్నిహిత ప్రమోద వేదనాక్రోశాలలో ఇరుక్కుపోయాడనిపిస్తుంది. కాని కొంచెం లోతుగా పరిశీలిస్తే ఒక అలౌకిక అలజడి, పర్యుత్సుకత వెలువడుతాయి. ఉపమానాలను రమ్యాతిరమ్యంగా రాణింపజేసే రాసోపాసకుడు గాలిబ్. " నీ ఇంటి వాకిట శిలనయినా కాను బ్రతుకెంత వ్యర్థమో! పాద స్పర్శయిన మిగిలేది నిత్యం నాదెంత దౌర్భాగ్యమో! " సాదా సీదా శబ్దాలతో కూడా రసస్వరూపాన్ని భావాన్ని చమత్కారంతో విగ్రహంలా నిలబెట్టగల దిట్ట గాలిబ్. ఇది పరిశీలించండి. " ఆమె వోరచూపుతో మోముపై తేజస్సు అలరారు; భావించిరి అది కని రోగికి కుశలమేనని వారు." ఇట్లా అనేకానేక రమణీయ భావచిత్రాలతో సాగుతుంది గాలిబ్ ప్రణయప్రయాణం. తన కల్లోలిత దైనందిన జీవితాన్ని, అనుభవించిన రసికతను కవితగా చెప్పుకున్నాడు గాలిబ్. గాలిబ్ ప్రియురాలు ఎవరో మనకు ఇదమిత్థంగా ఎక్కడా కనిపించదు. ప్రియురాలు ఉండేదని అంటారు. కాని ఆమె కావ్యంలో దృశ్యాదృశ్య శిల్పంలా ఉంటుంది. అంతా కప్పి చెప్తాడు. కప్పిచెప్పేదే కదా కావ్యం. అయితే ప్రేయసీ విశ్లేష దు:ఖాన్ని మాత్రం తనివి తీరా అనుభవించాడు, రెండు విధాలా. విరహ వేదన కాళరాత్రి కన్నా కష్టతరం అంటూనే, ప్రేమవల్ల జీవించే మజా సిద్ధించింది, వేదనకౌషధం లభించింది, ఔషధంలేని మదనవేదన వరించింది అంటాడు.

గాలిబ్ సారస్వతనిధిలోంచి నేను వందకు పైచిలుకు షేర్లను ఎంపికచేసుకొని తెలిగించాను. నా సామర్థ్యానికి అనుగుణంగా మొదట ఉర్దూలోనే కవితనర్థం చేసుకొని తత్సమాన గౌరవంగల పదచయనంతో అనువాదానికి ఉపక్రమించాను. ఉర్దూ వాక్సంప్రదాయాన్ని (idiom) తెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశాను. ఒక కావ్యానికి అనువాదం అగ్నిపరీక్షాలాంటిదని విజ్ఞుల అభిప్రాయం. నిజమైన కవిత్వం మాత్రమే పరీక్షకు నిలబడుతుంది. కవిత్వంకాని మాటలకూర్పు ఎగిరిపోతుంది. నేను అంత్య ప్రాస కోసం ఆరాటపడి భావానికి విఘాతం కలిగించ లేదు. ఒక లయ, శ్రావ్యత స్వాభావికంగా యేర్పడేట్లు మాత్రం ప్రయత్నించాను. కొన్ని సందర్భాలలో అదనంగా విశేషణాలు వాడడం అనివార్యమయినది. అలా కాకపొతే, భావావిష్కరణ అసంపూర్ణంగా అవగతమయ్యే ప్రమాదముంది.

నేను చేసినా ఈ అనువాద ప్రక్రియలో నేను పరామర్శించిన గ్రంథాలు: Ghalib, Life, Letters and Ghazals, edited by Ralph Russell, Oxford, Diwan-e-Ghalib by T.P. Issar, A Desertful of Roses by Frances W. Pritchet, Columbia University, మిర్జా గాలిబ్, జీవితం-రచనలు by డాక్టర్ ఎస్. సదాశివ. మఖ్దూం సాబ్రి, ఎం. జమాన్ & నవేద్ అఖ్తర్ గార్ల ఉర్దూ నిఘంటువులు చాల ఉపయోగపడ్డాయి. Platts, Johnson Thompson online Urdu dictionary నాకు చాలా ఉపయోగపడింది. సంస్కృత పదాల విస్తృత అర్థాలకోసం, Monier-Williams, V. S. Apte ల నిఘంటువులు వాడుకున్నాను.