ఉసే కౌన్ దేఖ్ సక్తా కె యగాన హై వొ యక్తా
జో దుఈ కి బూ భీ హోతీ తొ కహీఁ దో చార్ న హోతా
జో దుఈ కి బూ భీ హోతీ తొ కహీఁ దో చార్ న హోతా
ఎవడు దర్శించగలడు వాణ్ణి,
అద్వితీయం వాని ఏకత్వం
కాకపోవునా ముఖాముఖి,
గంధమోలె ఉన్నా ద్వితీయం
అద్వితీయం వాని ఏకత్వం
కాకపోవునా ముఖాముఖి,
గంధమోలె ఉన్నా ద్వితీయం
పరమసత్యం అద్వితీయమైనది, అంటే ఈశ్వరుడు కేవలుడు, ఒకేఒక్కడు అతనికి ప్రతిశక్తి అనేది ఉండదు. మాయ అని పిలవబడే నకారాత్మక శక్తికూడా ఈశ్వరజనితమే. ఇది వైదిక సిద్ధాంతం. ఏకం సత్, విప్రా: బహుధా వదంతి ; ఎకమేవాద్వితీయం అనేది ఆర్షఘోష. అల్లా అద్వితీయుడు, యితడు తప్ప వేరెవరూ పూజ్యులు కారు; ఇది ఖౌరానికము. అల్లాయొక్క ఐశ్వర్య వైభవంతో పోటీ, భాగస్వామ్యం (షిర్కత్ ) ఏ ఇతర శక్తికి ఉండదు. ఇందుకు భిన్నంగా భావించడం మహాపాపం (గున-ఎ-షిర్క్). ఇది ఇస్లాం మత మూలవిశ్వాసం. భగవంతుడు ఒక్కడే; రెండవది (దు'ఈ) గంధమాత్రమైనా ఉన్నపక్షంలో ఎక్కడోఅక్కడ దర్శనం లభించేది,` అని ఏకేశ్వరవాదాన్ని(తౌహీద్) తనదైన శైలిలో వివరించాడు.ఈశ్వరుడు ద్వయమై ఉండిన రెండుగా, నాలుగుగా (బహుత్వంగా) కూడా విద్యమానుడై
ఉండేవాడని ఇంకొక అర్థం. భగవంతునివలె తన ప్రియురాలుకూడా నిరుపమానమైనదని లౌకికార్థం.
No comments:
Post a Comment