Wednesday, June 30, 2010

On Jiddu Krishnamoorthi

చిన్నప్పుడు నేను రోజు ఆంధ్రభూమి దక్కన్ క్రానికల్ చదివి ఆరోజు సిటీలో ఎక్కడప్రోగ్రామ్స్ ఉన్నాయో తెలుసుకొని నాకిష్టమైన సభకో సమావేశానికో దాదాపు ప్రతిరోజూ వెళ్ళేవాణ్ణి. రకంగా నేను చాలా విషయాల్లో 'ప్రవేశ-జ్ఞానం' సంపాదించాను. నాకు పైత్రికంగా సంక్రమించింది ఈ ప్రాంతపు చరిత్ర, సంస్కృతులు మొదలైనవి మాత్రమే. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దేశభక్తి, సంగీతం, ముశాయరాలు , కవి సమ్మేళనాలు నగరంలో ఎక్కడున్నా వెళ్ళేవాణ్ణి. క్రమములోనే ఒక సాంస్కృతిక ఆధ్యాత్మిక అంతర్జాతీయ సమాజానికి దగ్గరయ్యాను. వారి ఆలోచన విధానానికి అతి సులువుగా ఆకర్షితున్నయ్య . ఏదో తెలుసుకోవాలనే తపన జిజ్ఞాస నన్ను ఎప్పుడూ వెంటాడుతుండేది ఆ పిపాస నాలో ఇంకా ఎక్కువవుతూ ఉంది. కొత్త విషయం పై ఎవరు ఏది చెప్పిన తొందరగా ఒప్పేసుకోవడం మొదట్లో జరిగేది. క్రమక్రమంగా వాటిలోని ఆంతర్యాలను ఆ వాదనల్లోని బలహీనతలను చాలా సులువుగా గ్రహించడం అలవాటైపోయింది. ఈ అంతర్జాతీయ సమాజం వారి వాదనల్లో నాకు పస కనిపించేది. ఇంత సులువుగా వారి దృష్టికోణానికి నేను ప్రభావితున్నయ్యానంటే కారణం ఉంది. వారు చెప్పే విషయాల్లో విధేయత, ప్రామాణికత. ఇంతకన్నా ముఖ్యం నాకు ఏమి తెలియక పోవడము. ఖాళీ పలకమీద రాయడం ఎంత సులభమో నా మనస్సు మీద కూడా సమాజపు ఆలోచనలు అంతే సునాయాసంగా అతుక్కుపోయాయి. ఆ విధానంలోనే, ఆ ఆలోచనా పద్ధతుల్లోనే ఆ విలువల్లోనే సత్యాన్ని అణ్వేషించే వాణ్ణి. అయితే అప్పుడు వయసులో, అంటే ఇంకా పారంపరిక జ్ఞాన ముద్రలు నా మస్తిష్కములో పడకముందే అలా జరిగింది. అది ఒక రకంగా మంచికే దారిచూపింది. నేను పెరిగే కొద్ది రకరకాల వాదాలు, శుష్క వేదాంతాలు, విచారణ పద్ధతులు, ఛాందస పోకడలు, మానవ విలువలకే విరుద్ధమైన ద్వేషపూరిత మతాలు ఎన్నో నాకు తారస పడ్డాయి. వాటన్నిటిని నాకున్న విచక్షణతో శోదించడం అలవాటయింది. ప్రతి సిద్ధాంతాన్ని క్షుణ్ణంగా విని, చదివి, చర్చించి అర్థం చేసుకోవడం ఒక నిరంతర ప్రక్రియగా నా సుప్తచైతన్యంలో ప్రతిష్టితమైంది .

కొన్ని మతాలవారైతే , ముఖ్యంగా భారతదేశం బయటినుండి వచ్చినవి, అసలు ఇతర మార్గాల్లో సత్యమనేది లేనేలేదని అవన్నీ దేవునికి ఎప్పుడూ వ్యతిరేకంగా ఉండే దుష్టశక్తి (శైతాను) చేత ప్రేరేపింప బడ్డాయని అతి దారుణంగా ప్రచారం చేస్తుంటారు. సత్యం అనేది కేవలం వారి దగ్గరే గంపగుత్తగా నిక్షిప్తమై ఉందని మొండి వాదనతో అమాయకులని మోసం చేస్తుంటారు.

ఈ మధ్య ఇస్లాం మతానికైతే కొత్త భాష్యం చెప్పడం మొదలైంది. వహాబీ ఇస్లాం ప్రకారం ముస్లింలు కాని వారికి అసలు జీవించే హక్కేలేదట. మరి వాళ్ళ పవిత్ర గ్రంథాలు అలా చెప్పాయట. ఇదే అచ్చమైన ఉగ్రవాదం. ప్రతిరోజూ ప్రపంచంలో జరిగే మారణకాండలో సింహభాగం ఈ ఇస్లామిస్టులు పెట్టిన చిచ్చే. సత్యం, పరబ్రహ్మం, పరమాత్మా, భగవంతుడు అని వివిధంగా పిలిచే తత్త్వాన్ని జిడ్డు కృష్ణమూర్తి అతి చక్కగా సులువుగా చెప్తాడు. అయితే ఆయన శేముషీ వైభవం (intellectual grandeur) సామాన్య మేధస్సుకు అంత సులువుగా లొంగదు. ఈ నాలుగు పాదాల్లో ఆయన బోధను గూర్చి నేనర్థం చేసుకున్నది రాసాను. ఇది సాహసమే.
నేను ఇంతకు ముందు రాసిన "సత్యమన్నది వజ్రకాంతిలాగుండునట......." అనే పద్యం జిడ్డు కృష్ణమూర్తి చేత ప్రభావితమైనదే.

జిడ్డు కృష్ణమూర్తి శేముషీ వైభవము
హెడ్డులన్నిటిలోకి యిమడబోదు; జీవన నావకే
తెడ్డులా వర్తించు ఆ బౌద్ధిక యోచనే
వొడ్డు వరకు మనల జేర్చు రామన్న!

Tuesday, June 29, 2010

పుట్టింది ఎక్కడో ఐనా...

Saina Nehwal has made us proud. She is a gem of this city of Hyderabad and a jewel of India. She has brought laurels to this country in this sport of Badminton. Earlier it was Prakash Padkone who did this feet. Though not born on this soil of Hyderabad, we have every reason to own her as a Hyderabadi girl. She looks dynamic, dedicated, focused, steadfast, naive, sober and modest, she exhibits all these qualities simultaneously. At a time when the country is taken over by Cricket relegating the other sports of better appeal, such a performance by our sports persons in the international arena is a great relief. All glories to this young girl, her coach and parents. Keep it up.
Moved by her performance, I have written the following:

పుట్టింది ఎక్కడో, ఐనా
కీర్తి తెచ్చింది మనకు సైనా
దాసోహమంది జపాన్ చైనా
విను రామన్న!

Saturday, June 26, 2010


ఈ నెలంతా (మే , జూన్ ) దేశంలో గృహిణులు నానా ఇబ్బందులు పడి పచ్చళ్ళు పెట్టారు. ఈ పచ్చళ్ళ గురించి కొంత చర్చ జరపొచ్చు. అసలు మొత్తం ఉపఖండమే పచ్చళ్ళకు బాగా అలవాటై ఉన్నది. ఇక దీని కూర్పులో ఉన్నంత వైవిధ్యం బహుశా ఇంకే వ్యంజనము, వంటకములో ఉండదు అంటే అతిశయోక్తి కాదేమో. మొదట ఈ వ్యంజనం పేర్ల గురించి. తెలుగు మాట్లాడే ప్రాంతాల్లోనే పచ్చళ్ళకు చాల పేర్లు ఉన్నాయి . ఆంధ్రలో ఆవకాయ పచ్చడి, తెలంగాణాలో మామిడికాయతొక్కు, కారాలు, ఊరగాయలు, ఇంకా కర్నూలు ప్రాంతంలో ఊర్మిండి అని వివిధ రకాల పేర్లున్నాయి. ఉత్తర భారతంలో కూడా అనేక రకాలుగా పచ్చళ్ళను వాడతారు. "అచార్" అనే పేరు మాత్రం చాల ప్రాంతాల్లో వినిపిస్తుంది. మే జూన్ నెలల్లో పచ్చడ్ల తయారికి మన ఇళ్లలో మహిళలు శ్రమ పడి రక రకాలుగా దినుసులు తయారు చేస్తారు. రోజుల్లో మాత్రం చాల మంది రెడీమేడు మసాలాల్నే వాడుతున్నారు. అయితే ఇంకా చాల ఇళ్ళలో దినుసులను స్వంతంగా తాయారు చేసుకొని పచ్చళ్ళను కలుపుతారు. మామిడి తొక్కు తయారుచేయడాన్ని కలపడం, పెట్టడం, వేయడం అనే క్రియారూపాలను వాడుతుంటారు. వీటి తయారీలో పెద్దవారి పాత్ర అధికం. వయసు మళ్ళిన అనుభవజ్ఞులైన నాయనమ్మలు , అమ్మమ్మలు వదినలు ఆడపడచులు చాల సలహాలు రెడి గా అందిస్తుంటారు. వీరందరి సలహా లేనిది అసలు ప్రాజెక్ట్ పూర్తి కానే కాదు. మహా వ్యంజనం కూర్పులో వారి మార్గదర్శనం అనివార్యం కూడా.

ఇంకొక ముఖ్యమైన విషయమేమంటే పచ్చళ్ళను చాల పవిత్రతతో శుద్ధిగా శ్రద్ధగా భక్తిభావంతో మడి కట్టుకొని ముడతారు. మర్తబాన్ అంటే పింగాణి జాడీలు వీటికి అనువైనయని అందరికి తెలుసు. చాల ఇళ్ళలో పచ్చళ్ళ జాడీలను పూజా రూముల్లోనే భద్రపరుస్తారు . ప్రతి సంవత్సరం మా ఇంట్లో జరిగే తంతును నేను చిన్నపట్నుంచి గమనిస్తున్నాను. ఉమ్మడి కుటుంబాల్లో ఈ ప్రక్రియ ఒక క్రతువులా చేసేవారు. ఇప్పుడు విడిపోయిన చిన్న సైజు కుటుంబాల్లో కూడా ఎంతో కొంత ఈ పచ్చళ్ళ తయారి కొనసాగుతూనే ఉంది. బజారులో అనేక రకాల పచ్చళ్ళు తయ్యారుగా దొరుకుతున్న ఈ రోజుల్లో మన ఆడవాళ్ళు ఎంతోకొంత ఇంట్లోనే తయారు చేయడం ఒక మంచి సంప్రదాయం. ఇది నిరంతరం కొనసాగాగుతుందని ఆశిద్దాం. ఈ మామిడి కాయ తొక్కుల తయారికి మా ఇంట్లో జరిగే హడావిడికి స్పందించి రాసినవే ఈ క్రింది మూడు పద్యాలు. భోజనప్రియులు చదివి ఆనందించండి.



అవనిలోని అన్నకళలలో మిన్నయి
ఆవకాయ కూర్పు అవతరించె ; భూ
ధవులను నిర్ధనులను సమముగా
సేవించు వ్యంజనమే గొప్ప విను రామన్న!

కాయ ఎంపికతో మొదలైన కారంఘాటు, వా
ళ్ళాయన్ను ఒప్పించి వారం పాటు; పెట్టె
నయ ఇంగువావ-వెల్లుల్లి పోపుల పోటు, ఆవ
కాయుంటే వంటింట్లో ఉండదు లోటు!

ఇంటికో రుచి యుండు మామిడి తొక్కు
పంటికో రుచినిచ్చు కారం-కిక్కు; తెలు-
గింటికే వన్నె తెచ్చు ఆవ గిమిక్కు, మా
ఒంటికే పడదాయె ఏమి లక్కు?





Thursday, June 24, 2010

Glorification of Hyderabadi Biryani

The most authentic Biryani in Inida is undoubtedly prepared in Hyderabad. I do not how but the aroma we get from well prepared Hyderabad Biryani is so unique that you are carried into that era of Qutubshahis of Golkonda kingdom. By the way, Biryani is an Iranian dish, brought to us by shia rulers of Golconda (Hyderabad-Deccan). Hence Biryani of Hyderabad has inculcated such an exotic mellow in it.

I thought of writing a poem in praise of Biryani. I started writing it in our traditional style of 'padyam'. The result, according to my friends and critics, is as beautiful and enchanting as the Biryani itself.

In this poem the taste of of Biryani is taken to such position that no poet has ever imagined to lift it to that height.

The poem says that even the immortal gods have fallen in love with this dish and having forgotten their divine status they started frequenting to Hyderabad on earth. They are so infatuated with the transcendental aroma of this preparation that it made them addicts to its taste. That is its uniqueness. There are many complaints about the absenteeism of these celestial beings in Indra-Sabha.

In order to control the frequent trips of gods an Order was required to be passed to restrict their visits to planet earth. That is the beauty of Hyderabadi Biryani.

This poem shall be appreciated by all the elite, the intellectuals and connoisseurs who relish Hyderabadi Biryani. It will sharpen their taste buds for this Unique Dish.



బిర్యాని వంటకాన్ని ఇంత వరకు కవి ఇంత ఉన్నతమైన రీతిలో ప్రశంసించి ఉండడు. బహుశా బిర్యాని పై కవితలు లేవేమో. దేవతలు కూడా హైదరాబాద్ బిర్యాని రుచికి వ్యసనపరులై దేవతలమనే విషయాన్ని కూడా పక్కనబెట్టి భూలోకంలోని హైదరాబాద్ కు తరచూ వస్తున్నారట. దీనితో అక్కడ స్వర్గంలో ఫిర్యాదులు ఎక్కువైనాయి, దేవతలు భూ లోకం లోనే కాలం గడిపేస్తున్నారని. అందువల్ల మాటిమాటికి భూలోకానికి దేవతల రాకడ పై ఆంక్షలు విధించడమయినది. ఇంత మహోత్కృష్టమైన వంటకం మన 'హైదరాబాది బిర్యాని' - ఆస్వాదించండి.

బిర్యాని
రుచిని మరిగి అమర్త్యులు సైతం
మర్యాద మరిచి భువికి రాపోసాగగ;
ఫిర్యాదులతో ఇంద్రసభ సతమతమై, బహు
పర్యాయముల రాకడ నిషిద్ధమాయె !


నాకు లవంగాలంటే చాల ఇష్టం. నా కార్ డాష్ బోర్డులో ఎప్పుడూ కొంత స్టాక్ ఉంటుంది. లవంగాల వల్ల ఎన్నోప్రయోజనాలున్నాయి. ప్రత్యక్షంగా అప్పటికప్పుడే మనకు ఒక లాభం చేకూర్తుంది. ఒక్కోసారి చాల సేపు మాట్లాడకుండామనం ఒక్క సారిగా నోరు విప్పితే కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు. మనము ఏదైనా మీటింగుకో మరేదైనా దావత్ కోవెళ్ళేటప్పుడు కూడా ధైర్యంగా ఎదుటివారితో మాట్లాడలేము. లవంగాలు రెండు నోట్లో వేసుకుంటే మనకు ఎంతో ధైర్యంఒస్తుంది. నాలుక బాగా 'తేజ్' అయినట్టు అనిపిస్తుంది. నోట్లో బాక్టీరియాను కూడా తగ్గిస్తుందట. ఆయుర్వేదం లవంగాలకుచాల సుగుణాలను ఆపాదిస్తుంది . నేను ఒక సారి ఇట్లాగే మాట్లాడుతుంటే మా భార్య, మీరు ఇంతగా పొగుడుతారు ఒకపద్యం రాయండి లవంగాల ప్రశస్తిని గురించి అని అన్నది. కార్లో నే పద్యం చెప్పాను. బహుశ ముప్పై ఏళ్ల తర్వాత నేను చేసిన తొలి ప్రయత్నం పద్యం. పరిశీలించండి.

అంగదుడు లంకకు పోగా,
వంగములు బహుమతిగ రావణుకిచ్చెన్ ;
దొంగలకవి ప్రియమాయె మహిలో
బంగరుకన్న విను రామన్న!

Wednesday, June 23, 2010

ఉగ్రవాదం వినాశకరం

మే నెల ఆఖరు వారం లాహోరు, పాకిస్తాన్ లో ఆహామదీయ తెగ పై (ఖాదియాని అని కూడాఅంటారు) జరిగిన ఊచకోత (ఖత్ల్--ఆమ్) కు స్పందించి రాసినది పద్యం. మాదే నిజమైనమతము మాకు మాత్రమే సత్యము ప్రకాశించింది అని వాదించి ఇతర మతస్తులకు జీవించే హక్కులేదు అని భావించే వహాబీ ముస్లింల ఉగ్రవాదాన్ని ఎత్తి చూపించేది పద్యం. పరిశీలించండి. మతం అంటే ఏమిటి? దేవుడు, సత్యం అంటే ఏమిటి? అనే విషయాని చాలా క్లుప్తంగా చెప్పడానికి చేసిన ప్రయత్నం ఇది.



సత్యమన్నది వజ్రకాంతిలాగుండునట
సత్యమన్నది పథ
రహితగమ్యం; పరమ
సత్యమే వివిధముగ వివరింతురిట విదులు, నే నమ్మిన
సత్యమే నిక్కమనుట ఉగ్రనీతి
.

మాయాజాలం - ఇంటర్నెట్

!!!...సుధర్మ రామ...!!!
ఇంటి నుంచే విశ్వవీక్షణం
ఇంటర్నెట్ సుఖదం సువ్యసనం

జ్ఞానమిపుడు సులభం తక్షణం

విను రామన్న!