Thursday, June 24, 2010

నాకు లవంగాలంటే చాల ఇష్టం. నా కార్ డాష్ బోర్డులో ఎప్పుడూ కొంత స్టాక్ ఉంటుంది. లవంగాల వల్ల ఎన్నోప్రయోజనాలున్నాయి. ప్రత్యక్షంగా అప్పటికప్పుడే మనకు ఒక లాభం చేకూర్తుంది. ఒక్కోసారి చాల సేపు మాట్లాడకుండామనం ఒక్క సారిగా నోరు విప్పితే కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు. మనము ఏదైనా మీటింగుకో మరేదైనా దావత్ కోవెళ్ళేటప్పుడు కూడా ధైర్యంగా ఎదుటివారితో మాట్లాడలేము. లవంగాలు రెండు నోట్లో వేసుకుంటే మనకు ఎంతో ధైర్యంఒస్తుంది. నాలుక బాగా 'తేజ్' అయినట్టు అనిపిస్తుంది. నోట్లో బాక్టీరియాను కూడా తగ్గిస్తుందట. ఆయుర్వేదం లవంగాలకుచాల సుగుణాలను ఆపాదిస్తుంది . నేను ఒక సారి ఇట్లాగే మాట్లాడుతుంటే మా భార్య, మీరు ఇంతగా పొగుడుతారు ఒకపద్యం రాయండి లవంగాల ప్రశస్తిని గురించి అని అన్నది. కార్లో నే పద్యం చెప్పాను. బహుశ ముప్పై ఏళ్ల తర్వాత నేను చేసిన తొలి ప్రయత్నం పద్యం. పరిశీలించండి.

అంగదుడు లంకకు పోగా,
వంగములు బహుమతిగ రావణుకిచ్చెన్ ;
దొంగలకవి ప్రియమాయె మహిలో
బంగరుకన్న విను రామన్న!

No comments:

Post a Comment