చిన్నప్పుడు నేను రోజు ఆంధ్రభూమి దక్కన్ క్రానికల్ చదివి ఆరోజు సిటీలో ఎక్కడ ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయో తెలుసుకొని నాకిష్టమైన సభకో సమావేశానికో దాదాపు ప్రతిరోజూ వెళ్ళేవాణ్ణి. ఆ రకంగా నేను చాలా విషయాల్లో 'ప్రవేశ-జ్ఞానం' సంపాదించాను. నాకు పైత్రికంగా సంక్రమించింది ఈ ప్రాంతపు చరిత్ర, సంస్కృతులు మొదలైనవి మాత్రమే. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దేశభక్తి, సంగీతం, ముశాయరాలు , కవి సమ్మేళనాలు నగరంలో ఎక్కడున్నా వెళ్ళేవాణ్ణి. ఆ క్రమములోనే ఒక సాంస్కృతిక ఆధ్యాత్మిక అంతర్జాతీయ సమాజానికి దగ్గరయ్యాను. వారి ఆలోచన విధానానికి అతి సులువుగా ఆకర్షితున్నయ్య . ఏదో తెలుసుకోవాలనే తపన జిజ్ఞాస నన్ను ఎప్పుడూ వెంటాడుతుండేది ఆ పిపాస నాలో ఇంకా ఎక్కువవుతూ ఉంది. కొత్త విషయం పై ఎవరు ఏది చెప్పిన తొందరగా ఒప్పేసుకోవడం మొదట్లో జరిగేది. క్రమక్రమంగా వాటిలోని ఆంతర్యాలను ఆ వాదనల్లోని బలహీనతలను చాలా సులువుగా గ్రహించడం అలవాటైపోయింది. ఈ అంతర్జాతీయ సమాజం వారి వాదనల్లో నాకు పస కనిపించేది. ఇంత సులువుగా వారి దృష్టికోణానికి నేను ప్రభావితున్నయ్యానంటే కారణం ఉంది. వారు చెప్పే విషయాల్లో విధేయత, ప్రామాణికత. ఇంతకన్నా ముఖ్యం నాకు ఏమి తెలియక పోవడము. ఖాళీ పలకమీద రాయడం ఎంత సులభమో నా మనస్సు మీద కూడా ఆ సమాజపు ఆలోచనలు అంతే సునాయాసంగా అతుక్కుపోయాయి. ఆ విధానంలోనే, ఆ ఆలోచనా పద్ధతుల్లోనే ఆ విలువల్లోనే సత్యాన్ని అణ్వేషించే వాణ్ణి. అయితే అప్పుడు ఆ వయసులో, అంటే ఇంకా ఏ పారంపరిక జ్ఞాన ముద్రలు నా మస్తిష్కములో పడకముందే అలా జరిగింది. అది ఒక రకంగా మంచికే దారిచూపింది. నేను పెరిగే కొద్ది రకరకాల వాదాలు, శుష్క వేదాంతాలు, విచారణ పద్ధతులు, ఛాందస పోకడలు, మానవ విలువలకే విరుద్ధమైన ద్వేషపూరిత మతాలు ఎన్నో నాకు తారస పడ్డాయి. వాటన్నిటిని నాకున్న విచక్షణతో శోదించడం అలవాటయింది. ప్రతి సిద్ధాంతాన్ని క్షుణ్ణంగా విని, చదివి, చర్చించి అర్థం చేసుకోవడం ఒక నిరంతర ప్రక్రియగా నా సుప్తచైతన్యంలో ప్రతిష్టితమైంది .
కొన్ని మతాలవారైతే , ముఖ్యంగా భారతదేశం బయటినుండి వచ్చినవి, అసలు ఇతర మార్గాల్లో సత్యమనేది లేనేలేదని అవన్నీ దేవునికి ఎప్పుడూ వ్యతిరేకంగా ఉండే దుష్టశక్తి (శైతాను) చేత ప్రేరేపింప బడ్డాయని అతి దారుణంగా ప్రచారం చేస్తుంటారు. సత్యం అనేది కేవలం వారి దగ్గరే గంపగుత్తగా నిక్షిప్తమై ఉందని మొండి వాదనతో అమాయకులని మోసం చేస్తుంటారు.
ఈ మధ్య ఇస్లాం మతానికైతే కొత్త భాష్యం చెప్పడం మొదలైంది. వహాబీ ఇస్లాం ప్రకారం ముస్లింలు కాని వారికి అసలు జీవించే హక్కేలేదట. మరి వాళ్ళ పవిత్ర గ్రంథాలు అలా చెప్పాయట. ఇదే అచ్చమైన ఉగ్రవాదం. ప్రతిరోజూ ప్రపంచంలో జరిగే మారణకాండలో సింహభాగం ఈ ఇస్లామిస్టులు పెట్టిన చిచ్చే. సత్యం, పరబ్రహ్మం, పరమాత్మా, భగవంతుడు అని వివిధంగా పిలిచే తత్త్వాన్ని జిడ్డు కృష్ణమూర్తి అతి చక్కగా సులువుగా చెప్తాడు. అయితే ఆయన శేముషీ వైభవం (intellectual grandeur) సామాన్య మేధస్సుకు అంత సులువుగా లొంగదు. ఈ నాలుగు పాదాల్లో ఆయన బోధను గూర్చి నేనర్థం చేసుకున్నది రాసాను. ఇది సాహసమే. నేను ఇంతకు ముందు రాసిన "సత్యమన్నది వజ్రకాంతిలాగుండునట......." అనే పద్యం జిడ్డు కృష్ణమూర్తి చేత ప్రభావితమైనదే.
జిడ్డు కృష్ణమూర్తి శేముషీ వైభవము
హెడ్డులన్నిటిలోకి యిమడబోదు; జీవన నావకే
తెడ్డులా వర్తించు ఆ బౌద్ధిక యోచనే
వొడ్డు వరకు మనల జేర్చు రామన్న!
No comments:
Post a Comment