Thursday, July 1, 2010

సెల్ ఫోను - కలియుగపు మహాసిద్ధి

ప్రపంచంలోని అన్ని దేశాలకంటే మన దేశంలోనే cell phone వ్యాప్తి ఎక్కువగా ఉంది. ప్రతి నెల కొన్ని లక్షల కొత్తకనెక్షన్లు అమ్ముడుపోతున్నాయి. సెల్ ఫోన్ వాడకం వృద్ధి రేటు మన దేశంలో అనూహ్యంగా పెరుగుతోంది. మన జనాభాఅలాంటిది మరి. సెల్ ఫోన్ వచ్చిన కొత్తలో సౌకర్యం కేవలం అతి ధనవంతులకే పరిమితమౌతుంది అని భావించాము. కాని యుగంలో టెక్నాలజీ మహత్యం బీద సాదలకు ధనవంతులకు అందరికి అతి తక్కువ ధరలకే లభించడమనేది చాలా గొప్ప ఉపలబ్ధి, సంసిద్ధి. పూర్వ యుగాల్లో కేవలం ఋషులకు మునులకు సిద్ధపురుషులకుమాత్రమె సాధ్యపడేదట ఇలాంటి మహిమాన్విత సంభాషణ. అలాంటి యోగం తర తమ వర్ణ వర్గ బేధాలు లేకుండా అందరికి లభించడం కలియుగపు విశిష్టతగా చెప్పుకో వచ్చు. సెల్ ఫోనుకు ఇప్పుడు ఎంత ప్రాముఖ్యత ఉందో ఒక్కసారి తెలుసుకోవాలంటే అసలు అలాంటి సౌకర్యం మనకు లేదని కొంచెంసేపు ఊహించుకుంటే చాలు. సౌకర్యంపై నేను రాసిన చమత్కారిక. చదివి ఆనందించండి.

'సెల్ ఫోను'తో మునులైనను మౌనమువీడి
కిలకిలయని భాషింతురు సురకాంతలతో;
షులకైనా సాధ్యమా వింతవిద్య
కలి జ్ఞానుల ఘనతే ఇది విను రామన్న!

No comments:

Post a Comment