Saturday, July 3, 2010

అడవికి ఎందుకు పోయాను?


I started reflecting ever since the war on Maoists has begun. I know for certain that injustices have been committed in this world from time immemorial and they will continue. Man, the only animal that can question and revolt has been inflicted with constant indignities and humiliations and deprivations. All this has been going on with immunity through various institutionalized theories like fate, faith, divine intervention and the carry-forward effects of earlier deeds etc.

We know these have been the effective tools of the affluent elite societies to keep the under privileged human groups in an eternal mode of servitude. This is an intelligent conspiracy of the exploiters.

Now that when human intellect is evolving towards finer and finer aspects of existence we must make the earlier theories of birth-related disadvantages meaningless. If birth alone continues to confer the facilities on some groups and disabilities on the others, this conflict shall never cease to exist. We must put an end to this cruelty. Why one is attracted to the jungles and why one turns a rebel should be the only study that should engage the minds of the academics and planners of this country. In the name of modern democracies what is happening is creation of new-classes of ruthless land grabbers, power mongers and wealth maniacs.

We now, cannot support the armed struggle of the Maoists by any stretch of imagination, because they have lost the humane touch and they have proved to be more calamitous and cruel than their adversaries. Brutality under the garb of people's struggle for emancipation with an aim to overthrow the establishment is totally untenable. At the same time, we cannot stop thinking as to why did they become like that. This free verse gives you an insight into the causes that I have seen, understood and experienced - partly real and partly imagined.
సహానుభూతి, స్వ-అనుభూతి కలిసి ఈ క్రింది కవితలా రూపుదాల్చింది.



అడవి నన్ను పిలిచింది నా ఆత్మ నన్నే దూషించింది

తల్లికి దూరం నా చెల్లికి దూరం
నా పల్లెకు దూరం నా సాల్లెకు దూరం
అడవి నన్ను పిలిచింది నా ఆత్మ క్షోభించింది

సర్కారి స్కూల్ల చదువెపుఢూ చెప్పలేదు
ఇంటికొస్తే నా కడుపెపుడూ నిండ లేదు
అయ్యకు సర్వం సారానే అయింది,
చేతకే మా అమ్మ అంకితమయిపోయింది

ఆటకు పొతే నన్ను దూరముండుమన్నారు
గుడికి పొతే నన్ను గుడ్లురిమి చూసారు
నీళ్ళకు పొతే మా కాళ్ళు విరగొట్టారు
కట్టబోతే నాకు బట్టలే
లేవాయె
రోగమొస్తే నాకు మందులే
కరువాయె

ఎండా కాలమెట్లాగో నేను ఎల్లదీసాను
కాళ్ళకు పొక్కులొచ్చి కుళ్ళి కుళ్ళి ఏడ్చాను
వానాకాలం నన్ను తడిపి ముద్ద చేసింది
చలికాలం నా పాలిటి పులి అయి వణికించింది

అడివి నన్ను పిలిచింది, నాకాశ్రయం కల్పించింది

కారుణ్యం లేని కపట జగతితో ఏమి పని

మాకు దక్కని దొంగప్రగతితో ఏమి పని
చెట్టునైనా అయితే వసంతం నన్నూ వరించేది
పిట్టనైనా అయితే ఆకాశం ఆదరించేది


మాకు
పూజలు లేవు
మాకు పూలతో ఏమి పని
వసంతం ఎవరికోసం? నాకు ప్రకృతితో ఏమి పని
కోకిల పాటల్లో ఇపుడు కోపమే వినిపిస్తుంది
కోడి కూత నుంచి ఉత్తేజం ఉరికి వస్తుంది

మత్తులో ఉంచే కర్మ సిద్ధాంతాలు మాకొద్దు
జిత్తులమారి ధర్మ రాద్ధాంతాలు మాకొద్దు

అడవి నన్ను పిలిచింది నా ఆత్మ రోదించింది
పుట్టుకే పాపమైంది బ్రతుకే శాపమయింది

ఇపుడు నేను చదివేది ద్వేషించడమనే చదువు
నేను నేర్చింది కసి తీర్చుకునే దరువు
నా గుండెను మండించింది అర్థంలేని కరువు
పోరుకే అంకితమయింది నా వర్ణంలేని తనువు

ఇపుడు నేను తినేది ధైర్యమనే తిండి
నేను తిరిగేది చావుబతుకుల మద్య బండి
నా చెల్లి అయింది ఒక భయంకర చండి
మేమంతా ఇపుడు తెగించిన జగమొండి

నాకు బాధలు తెలుసు నాకు అనాథలు తెలుసు
నాకు ఆకలి తెలుసు ఆక్రందనల ఘోరకలి తెలుసు
నాకు దాస్యం తెలుసు అపహాస్యం తెలుసు
నాకు గాయం తెలుసు దోచుకున్న ప్రాయం తెలుసు
నాకు బేబసీ తెలుసు నాకు బగావత్ తెలుసు
నాకిపుడు ప్రళయం సృష్టించే కళలన్నీ తెలుసు

అడవి నన్ను పిలిచింది - నా ఆత్మఇలా ఘోషించింది


సాల్లె = పాఠశాల; బేబసీ=నిస్సహాయత ; బగావత్ =తిరుగుబాటు


No comments:

Post a Comment