జీవన్మరణాల
మధ్య భేదముండదు,
ఇది ప్రణయప్రయాణం
వారినే స్మరిస్తూ బ్రతకాలి
ఏ నిర్దయి కోసం వదిలామో ప్రాణం
ప్రేమ అనేది ఒక మానసిక వికారమని, కామమని ఇదివరకే ఒప్పుకున్నాడు గాలిబ్. ప్రేమ అని పిలవబడే ఈ కామవ్యవహారంలో జీవన్మరణాల మధ్య భేదముండదంటున్నాడు. వల్లమాలిన ప్రేమపిచ్చిలో అవతలి వారు ఎంత సాధించి వేధించినా వారిపైనే సర్వం ధారపోసి గౌరవమర్యాదలు సైతం కోల్పోయిన వ్యక్తులు లోకంలో తారస పడుతుంటారు. రెండవ పాదంలో చెప్పిన ఉపపత్తి మనను సుందర కాండ వైపు నిర్దేశిస్తోంది. వాల్మీకి ఈ విషయాన్నే మరో విధంగా వర్ణించాడు. "వామః కామో మనుష్యాణాం యస్మిన్ కిల నిబధ్యతే, జనే తస్మిన్స్త్వనుక్రోశః స్నేహశ్చ కిల జాయతే." (మనుష్యులకు కామము దుష్టమైనది, ఎవరియందు బంధించబడతారో వారిపట్లే దయా, స్నేహాలు పుట్టుకొస్తాయి)