సాధకుడు తన సత్స్వరూప జ్ఞానం పొందిన పిదప అనుభవించే స్థితి ఇది. 'అహం బ్రహ్మాస్మి', 'అన అల్ హఖ్', 'అనఅల్ బహర్' వంటి వాక్యాలన్నీ ఆత్మసాక్షాత్కారం పొందిన సాధకుని తత్త్వదర్శన నిదర్శనాలు. భగవంతుని సన్నిధి చేరిన భక్తులకు, ప్రియురాలి మెప్పు పొందిన ప్రేమికులకు ఏమి తక్కువ. తదీయులం మేము, "హం ఉస్కే హై( " ఇది బిందువు సింధువుతో తాదాత్మ్యము పొందిన స్థితి. సకల ఇహపర సౌభాగ్యాలు వాళ్ళ కాళ్ళ కిందే ఉంటాయి.
No comments:
Post a Comment