హోతా హై నిహాఁ గర్ద్ మెఁ సెహరా మెరె హోతే
గిస్తా హై జబీన్ ఖాక్ పె దరియా మెరె హోతే
మరుభూమి, మట్టిలో
మరుగునపడు మేముండగ;
సముద్రమే నేలరాయు
లలాటం, మా ముందర
మరుగునపడు మేముండగ;
సముద్రమే నేలరాయు
లలాటం, మా ముందర
తన వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని మరొకసారి ఆవిష్కరిస్తున్నాడు గాలిబ్. భూమిపై ఒక ఝంఝావాతం తాను సృష్టిస్తే, ఇసుకతూఫాన్లకు సహజాశ్రయమైన ఎడారి ఆ ప్రచండవాయువీచి లేపిన ధూళిపర్దాలో తన అల్పత్వానికి సిగ్గుపడి దాక్కుంటుందట. గాలిబ్ సమక్షంలో సముద్రుడు కూడా, తన దౌర్బల్యాన్ని ప్రదర్శిస్తూ తల భూమిపై గుద్దుకున్నట్టే ఉందట. సముద్రకెరటాల అలుపెరుగని ఆరాటాన్ని, నుదురు నేలరాయడమనడం ద్రష్టకాని సామాన్య రాతగానికి తరముగాని అహంభావ ప్రదర్శన.