Sunday, August 22, 2010

ఓంనగర్ జ్ఞానపీఠం

పామరులకైనా పాండిత్యము నేర్పు,
జిజ్ఞాసులందు పిపాసపెంచు
రామభక్తియందాసక్తి కలిగించు,
పాదచారపవనవాగ్ములకు వి
శ్రామమిచ్చు, జ్ఞానవిజ్ఞానచర్చలింపుగాసాగించు,
ధ్యానహఠయోగులకా
రామమై యుండు, ఓంనగర వనమందు
విరజిల్లె విజ్ఞులజ్ఞానపీఠం

Sunday, August 8, 2010

సీమాంధ్రులు మదాంధులు


సీమాంధ్ర మదాంధ నేతలు

కావరం పట్టిన మాటలు
కపటం నిండిన చేతలు
సీమాంధ్ర మదాంధ నేతలు
వారి దుర్మార్గపు కూతలు.

తెలంగాణ కోరితే దేశద్రోహులమంట
తెలగాణ్యులంతా జాతి శత్రువులంట

సమైక్యాంధ్రుల కల్లబొల్లి లొల్లిల
తెలంగానోల్లున్నర? కలిసుందామన్నర?
ఏకపక్ష ప్రేమ ద్వేషాలకు తెరుస్తుంది తలుపు
ఇద్దరికిష్టమయినపుడే పండుతుంది వలపు

ఇష్టమైతేనే దోస్తీ
చెల్లదు మీ ఆంద్ర జబర్దస్తీ
మీ అన్యాయాలకిక స్వస్తి
లేదంటే ఇగ కుస్తీమస్తీ


రద్దయింది మీతో మా పొత్తు
మీరు దోచిందంతా మాదే సొత్తు
మీ గుండెల్లో విషముంది నిలువెత్తు

సీమాంధ్ర అసెంబ్లీ దొంగల పరిషత్తు

తర్కాలన్నిట బద్దలయింది ధూర్తులభాండం
వింతవాదంతో చేస్తున్నారు వీరు వితండం
వాళ్ళ మనుగడకే ఇక దినదిన గండం
కావాలె మన ఘోష అఖండం ప్రచండం

వికృత వాక్కులు వల్లించారంటే
విషశరాలు మనపై విసిరినట్టే

ఇంగితజ్ఞానం విడిచి తెగించారంటే
వినాశకాలం వాళ్ళను వెంటాడుతున్నట్టే

పెగ్గులు పెగ్గులు పోసి దుగ్గల్ని కొనుక్కున్నారట
చీరెలు సారెలు పెట్టి కౌరును వాడుకున్నారట
దారుస్సలాముల దావతిచ్చి షరీఫ్ ను షర్మిన్ద చేసిండ్ర

న్యాయం చెప్పే శ్రీకృష్ణున్ని శకునిగ మార్చేసిండ్రు

ధర్మగీత చెప్పేవానితో అధర్మరాతలు రాయిన్చిండ్రు

దోపిడీకి మరిగిన దొంగలను ఊరికే వదులుదామ?
చావిడీకి ఈడ్చి వీళ్ళను వేళ్లాడ తీస్తామా?
కొవ్వు పట్టిన కుక్కలను తరిమి తరిమి కొట్టుదాం
తెలంగాణ గడ్డనుంచి గుడ్డలొలిచి తోలుదాం

రామచందర్ దీకొండ







Saturday, August 7, 2010

Anti-National Remarks of Andhra Ministers


Andhra integrationists have yet once again displayed their brazen hatred towards Telangana state. The remarks made by SeemaAndhra ministers after making their presentation before the Justice Sri Krishna Committee on 6th August, 2010 are highly objectionable and deplorable. Till yesterday, I had a different opinion about the integrity and the morality of the Andhra and Seema people in general and leaders in particular. I thought they had at least one valid tenable reason to oppose the disintegration of the state of Andhra Pradesh. Now with this statement that those who are aspiring for a separate state of Telangana are anti-nationals and they must be prosecuted for treason has changed my glimmering good opinion about these SeemaAndhra leaders. These Andhra leaders who pose themselves to be highly intelligent and law-knowing have fallen from the esteem of simple people of Telangana region. By speaking against the provisions of the Constitution of India, they have rendered themselves liable to be prosecuted for the anti-national provocative remarks.

Andhras must know, and they do know, that creation of new states within the frame work of the Constitution of India is not only provided for in the clearest terms, but also practiced time and again in the federal polity. So many new states were either created or bifurcated yielding to the legitimate demands and long cherished aspirations of the people. Andhra intellectuals must realize that a government is there in a democracy to cater to the aspirations and demands of its people who have elected it. The unashamed statement made by the ministers sounds as if it was made by a bigoted Andhra fanatic in the streets of Vijayawada or Guntur. All those persons who went as a team to the Committee were ministers holding constitutional offices in the government. They are well aware, that their own state of Andhra was formed out of Madras state, after a great struggle launched by Shri Potti Sriramulu. By their own logic, even this leader must be imputed with the charge of treason for fighting for a separate state of Andhra.

By this statement Andhras have forfeited their right to live in Telangana. What kind of attitude towards Andhra vested interests can be expected of Telanganites after the formation of their state. In my opinion, SeemaAndhras have not only displayed their hatred towards Telangana but spewed venom. My opinion about Andhras that they were more refined, educated and smart has crashed like a failed jet. They stooped to the level of comparing the unrest in Kashmir with the just cause of Telangana. It is now proved beyond doubt that Andhra and Seema leaders have no interest in the people telangana, they are just worried about their ill-gotten wealth made out of the resources of this region. They have started conducting themselves has lunatics because they have no point in their favour. Their statement is an out come of deep frustration and a sign of acceptance of defeat. Otherwise, how can these intelligent ministers blurt out these uncanny remarks. All their arguments against Telangana are falling like a castle of cards. They should always bear in mind that they cannot compel us to live with them. No law can support this. We now hate them for their misdemeanor. I have today declared them as personea non gratae from my side. I am sure all supporters of this just cause shall do the same.

Now, having committed this grave blunder, they must tender their unconditional apology to the people of Telangana forthwith. Otherwise, they have no right to continue as ministers nor do they have a right to live here. These ministers must be gheraoed wherever they are found. They must be taught a lesson in a befitting way.


Ramchander Deekonda

Tuesday, August 3, 2010

ఆత్మహత్యలు వినాశాకరమైనవి

తెలంగాణా ప్రజలు మళ్ళీ ఇంకొకసారి నిరూపించుకున్నారు స్వరాష్ట్రం కోసం వారి ప్రతిబద్ధతను.ఇపుడు సెంటిమెంటు గా పేర్కొనబడే ఆకాంక్ష ఒక బలమైన ప్రజాస్వామికమైన, రాజ్యాంగానికి లోబడిన డిమాండుగా పరిణమించింది. ఏ ప్రజాస్వామిక వ్యవస్థ ఈ డిమాండును కాదనలేదు. ఈ ఉద్యమాన్ని, ఈ జనచైతన్యాన్ని కాదంటే, ఇక ఇది ప్రజాస్వామ్యమే కాజాలదు. ఒక రాష్ట్రం, వారి అభ్యుదయం కోసం స్వయంపాలనకోసం తిరిగి ఏర్పడాలనేది వారి ప్రఘాడ ఆకాంక్ష. తెలగాణ్యులు అమాయకులే కావొచ్చు, కాని అవివేకులుమాత్రం కాజాలరు. మళ్ళీ సీమాంధ్రుల తీపిమాటల బుట్టలో పడలేరు. నూటికి నూరు శాతం గెలిచారంటే అది ఒక గొప్పఐక్యతా ప్రదర్శనే మరి. ఉద్యమంలో ద్రోహులెప్పుడూ ఉంటారు. వాళ్లకు కూడా బుద్ధి వస్తుందని ఆశిద్దాము.

అయితే, యువకులు భావోద్రేకాలకు లోనయి అనవసరంగా ఆత్మహత్యలకు పాల్పడటం చాల బాధాకరమైన విషయము. అసలు తెలంగాణా రాష్ట్రం వాళ్ళకోసమే కదా మనందరం కోరేది. వాళ్ళు అనుభవించని తెలంగాణా మనకెందుకు. మా జీవితాలు ఎట్లాగో గడిపాం. వివక్షకు, శోషణకు, అపహాస్యాలకు, హేళనకు గురయ్యాము. మన పిల్లలు అట్లాంటి బాధలు అనుభవించ వద్దు. నిరాశ నిస్పృహను కలిగిస్తుంది. అక్కడినుంచి ఎన్నో వికారాలు బయలుదేరుతాయి. ఒకానొక బలహీనక్షణములో బ్రతకడమే అనవసరమనిపిస్తుంది. భయంకర క్షణాలని అధిగమించాలి. దీనికి మంచి ఉదాహరణ రామాయణంలో ఉంది. సీతమ్మను వెతికి వెతికి అలసిపోయి నిరాశకు గురి అవుతాడు హనుమంతుడు. సీతమ్మ కనపడలేదని ఎట్లా చెప్పగలడు రామునికి. పని చేయలేడు కాబట్టి, ప్రాణాలను వదిలేందుకు నిర్ణయిస్తాడు. అయితే క్షణంలో ఒక ధైర్య కిరణం అతని మదిలో వెలుగుతుంది. నేనైతే చచ్చిపోతాను, కాని తర్వాత పర్యవసానంగా ఏమౌతుంది అనికొంచెం సావధానంగా ఆలోచిస్తాడు మన మారుతి. అతనికి ఎంతో దారుణమైన చిత్రం గోచరిస్తుంది. 'నాకోసం వేచి వేచి రాముడు ఖిన్నుడౌతాడు . సీత జాడతెలియక శ్రీరాముడు ప్రాణాలు వదలడం ఖాయం. అది చూసి లక్ష్మణుడు కూడాచనిపోతాడు. ఇదంతా చూసి కిష్కింద రాజు, రాముని మిత్రుడు, సుగ్రీవుడు కూడా ఏదో చేసుకోరానిది చేసుకుంటాడు. తర్వాత వానర రాజ్యం నశిస్తుంది. అయోధ్యలో అల్లకల్లోలం చెలరేగుతుంది. ఇట్లాగ వినాశ పరంపర సాగిపోతుంది. ఇవన్నీ నా ఆత్మహత్య వల్ల కలిగే ఉపద్రవాలు. కాబట్టి, ప్రాణం విలువైనది. ఓపికతో నిష్టతో ప్రయత్నిస్తే లక్ష్యం తప్పక నెరవేరుతుంది' అని అనుకొని ఆత్మహత్యా ప్రయత్నాన్ని విరమించుకుంటాడు హనుమంతుడు. "వినాశే బహవో దోషా జీవన్ ప్రాప్నోతి భద్రకం, తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవతి సంగమః " (సుందర కాండ) ఆత్మహత్య వినాశాకరమైనది. అది పాపకార్యం కూడాను. ఆత్మహత్య ఎన్నో దోషాలకు దారి తీస్తుంది. బ్రతికి ఉంటే ఎన్నడో ఒకనాడు తప్పక మనలక్ష్యం నెరవేరుతుంది. ప్రాణాలను కాపాడుకొని ఉద్యమించడమే అన్నివిధాల శ్రేయస్కరం. అని నిర్ణయించుకొని కృతార్థుడౌతాడు మన వీరహనుమాన్. ఆయనే మనకు ఆదర్శం, మార్గదర్శి.
ఆత్మహత్యకు పాల్పడే వారు నరకలోకాలను అనుభవిస్తారని ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయి. "అసుర్యా నామ తే లోకా అంధేన తమసా ఆవృతా: , తాం తే ప్రేత్యాభిగఛ్చంతి యే కే ఆత్మహనో జనా:" (శ్రీ ఈశోపనిషత్తు) అంటే ఆత్మహత్య చేసుకున్న జనులు, అంధకారము అజ్ఞానములచేత ఆవరింపబడిన అసుర (నరక) లోకాలను పొందుతున్నారు. అందుచేత -

"ఆత్మత్యాగమొద్దు తెలగాణ వీరుడా, మ
హాత్ములవోలె పోరు సల్పుదాం మనము, దు
రాత్ముల నికృష్ట నీతులను దునుమాడి, విజి
తాత్ములమై విరుచుకుపడదాము తుదకు."

సందర్భంలో ఒక ఉర్దూ కవి అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి. थर थराते हैं अन्धेरे तो लरज़ थे क्यों हों? हर नयी सुबह कि तकलीक यूहीं होती हैనిరాశ చీకట్లు కమ్ముకుంటుంటే అట్లా ఎందుకు వణికిపోతావు మిత్రమా? ప్రతి ఉషోదయం ముందు ఇలాగే ఉంటుంది తంతు. ఇంకొక గొప్ప ఉర్దూ కవి ఇక్బాల్ ఏమంటాడో చూడండి. अगर उस्मानियों पर (read तेलंगानियों पर) खोय-- ग़म टूटा तो क्या ग़म है? के खून--सद हज़ार अंजुम से होती है सहर पैदा. (తెలంగాణీయుల) ఉద్యమకారుల మీద ఎన్ని కష్టాల పర్వతాలు విరుచుకుపడ్డా అవేమి భరించరాని బాధలు కావు. వాళ్ళు భయపడరు. కారణం, అసంఖ్యాక నక్షత్రాలు రాలిన తర్వాతే కదా శుభోదయం ప్రాప్తిస్తుంది.
అందుచేత తెలంగాణా వీరులారా, చచ్చి సాధించేది ఏమి ఉండదు. బ్రతికిఉన్నవారికే అన్నీ ప్రాప్తిస్తాయి. సత్యాన్ని గుర్తెరిగి ఓపిక సంయమనం ధైర్యంతో ముందుకు సాగుదాం. ఆత్మహత్య మహా పాపం, ఆశుభకరం. మనను కన్నవారికి ఆప్తులకు శోకాన్ని మిగిల్చిన వారమవుతాము. అలాంటి దురాలోచనలకు దూరంగా ఉండాలి. ఎవరైనా దారుణమైన విషయాన్ని చర్చిస్తే ఆ ధోరణి వారిలో గమనిస్తే అందులో దాగిఉన్న దుష్పరిణామాలను వారికి వివరించి చెడుమార్గము నుంచి వారిని తప్పించాలి. ఇది అందరి కర్తవ్యం.


దీకొండ రామచందర్
9966354106