మే నెల ఆఖరు వారం లాహోరు, పాకిస్తాన్ లో ఆహామదీయ తెగ పై (ఖాదియాని అని కూడాఅంటారు) జరిగిన ఊచకోత (ఖత్ల్-ఎ-ఆమ్) కు స్పందించి రాసినది పద్యం. మాదే నిజమైనమతము మాకు మాత్రమే సత్యము ప్రకాశించింది అని వాదించి ఇతర మతస్తులకు జీవించే హక్కులేదు అని భావించే వహాబీ ముస్లింల ఉగ్రవాదాన్ని ఎత్తి చూపించేది ఈ పద్యం. పరిశీలించండి. మతం అంటే ఏమిటి? దేవుడు, సత్యం అంటే ఏమిటి? అనే విషయాని చాలా క్లుప్తంగా చెప్పడానికి చేసిన ప్రయత్నం ఇది.
సత్యమన్నది వజ్రకాంతిలాగుండునట
సత్యమన్నది పథరహితగమ్యం; పరమ
సత్యమే వివిధముగ వివరింతురిట విదులు, నే నమ్మిన
సత్యమే నిక్కమనుట ఉగ్రనీతి.
No comments:
Post a Comment