Wednesday, August 10, 2011

శ్రేయ రాకతో

ఎడారి లోన జడి వాన కురిసింది
శ్రేయ రాకతో మా ఇల్లు మురిసింది
చిరకాలానికి పారిజాతం విరబూసింది
ఇల్లు సంతోష సౌరభాల నెలవయ్యింది

తాతయ్యలకు నానమ్మమ్మలకు ముద్దుల
మాటల మూటలు తెచ్చింది
ఆకురాలు కాలంలో ఆమనిలా వచ్చింది

ఎడారిలోన జడివాన కురిసింది
శ్రేయ రాకతో మా ఇల్లు మురిసింది

పవన ఓడలో శోభిత అయి వచ్చింది
రామకొండ పై అనురాధతారలా మెరిసింది
ప్రేమనదిలా మా గుండె నిండింది
తేజపుత్రిగా ప్రదీప్తులు పంచింది
లహరిజ అయి ఇల్లంతా పారింది

ఎడారిలోన జడివాన కురిసింది
శ్రేయ రాకతో మా ఇల్లు మురిసింది

No comments:

Post a Comment