Saturday, April 16, 2011

గాలిబ్: విశ్వాసము - ప్రేయసీ

दिले नादाँ तुझे हुआ क्या है

आखिर इस दर्द की दवा क्या है

हम को उनसे वफ़ा की है उम्मीद

जो नहीं जानते वफ़ा क्या है.



ఏమైందో నీకు, మాయలెరుగని ఓ మనసా

నీ ఆవేదనకిక మందే లేదా?

విశ్వాసమంటే ఎరుగని వారిని

విశ్వసించడమే నీ గోస


नुकतह-चीं है, ग़म-ए दिल उस को सुनाए न बने
कया बने बात जहां बात बनाए न बने


దోషమెంచడమే ఆమె పని, మనోవ్యథ వినిపించుకోదెంత చెప్పినా
ఆశలు నెరవేరేదెట్లో
అచట ఫలితం శూన్యం హృదినెంత విప్పినా

इशक़ पर ज़ोर नहीं है यह वह आतिश ग़ालिब
कि लगाए न लगे और बुझाए न बने


ప్రేమపైధికారమొప్పదు, ప్రేమ నిప్పు లాంటిది
రగిలిస్తే రగలనిది, రగిలితే మరి ఆరిపోనిది

{191,2}

मैं बुलाता तो हूं उस को मगर अय जज़बह-ए दिल
उस पह बन जाए कुछ ऐसी कि बिन आए न बने

నా పిలుపు ఎపుడూ ఆమెకోసమే, అయినా ఓ అనురాగవీచిక!

పారాలి ఆమెపై మాయేదో, అయ్యేను తప్పని అభిసారిక

ग़ैर फिरता है लिये यूं तिरे ख़त को कि अगर
कोई पूछे कि यह कया है तो छुपाए न बने


తిరిగేరు పట్టుకుని నీ ఉత్తరం పరులు

అదేమనడిగితే దాచలేరు మరులు

इस नज़ाकत का बुरा हो वह भले हैं तो कया
हाथ आवें तो उंहें हाथ लगाए न बने


ఆమె లావణ్యం ఆమెకే చెల్లు, ఆమె సౌశీల్యం వల్ల మాకేమి ఒరుగు

ప్రేయసి మా చేతచిక్కినా, సంగమభాగ్యమెలా కలుగు?




















No comments:

Post a Comment