Sunday, April 10, 2011
అన్నా హజారే పంతం
అన్నా హజారే పంతం
అవినీతిని చేయునా అంతం ?
అంతం కాదిది ఆరంభం
పౌరసమాజపు సంరంభం
ఒకటయింది శోషిత దేశం
పెరిగింది క్రోధావేశం
మన్మోహనుడైతే ఏమి
సోనియా ఐతే ఏమి
అంతా కుంభకోణమయం
అంటింది అందరికీ గోమయం
కల్మాడి రాజా రాడియా
దొంగల పాలయింది ఇండియా
సచ్చీలతే మన్మోహన గర్వం
నీ మౌనమే ముంచింది సర్వం
గట్టి నాయకుడు లేని ఈ రాజ్యం
అయింది గజ దొంగలకు భోజ్యం
జాతి శత్రువుల పట్ల నీ చోద్యం
దేశమయ్యింది ఉగ్రవాదులకు సేద్యం
అమాత్యులు చేసేది దోపిడీ
నీ సచివులు చేసేది గారడీ
పార్టీకి ముఖ్యం రాబడి
నీ పాలనంత ఒక ప్యారడి
పైనుంచే పారు సద్గుణ ఝరీ
తలయందే కుళ్ళును చేప మరీ
న్యాయకోవిదులే కొంత ఊరట
లోక్ పాల్ బిల్లే మనకు బాసట
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment