Monday, April 4, 2011

శ్రీఖర ఉగాది

కాలశకలమే ఈ శ్రీఖరం

కాలానికి కాదు శ్రీకారం

కాలము నిర్ణయించే నియంత

కాలము జయించు జగమంత

కాలమే అందరి విధాత

కాలమే విశ్వ ప్రదాత

కాలమెరుగదు ఆద్యంతం

కాలమానం మర్త్యుల రాద్ధాంతం

కాలగర్భం నుండే జనించు ప్రభవ

కాలవలయంనుండే వెలువడు విభవ

కాలజనితం ప్రజోత్పత్తి

కాలవిహితమే విరోధి, వికృతి

కాలమే తెచ్చు వసంతం

కాలమే యిచ్చు హేమంతం


కాలపరాయణం సౌరమండలం

కాలప్రబోధితం మనోమండనం

కాలమే పెద్ద ఓదార్పు

కాలమే నేర్పు ఓర్పు

కాలమే తెస్తుంది మార్పు

కాలమే చిట్టచివరి తీర్పు

No comments:

Post a Comment