Thursday, March 10, 2011

ప్రజాస్వామ్యమని మోసగించిరి
తెలగాన వారి గోసమరిచిరి
పది జిల్లల పిల్లలు జెల్లలు
ఒల్లం ఆంద్ర యని ఎంత వగచినా
దౌర్జన్యంగా మాపై దౌడు జేసిరి
సౌజన్యం గా వినకపోయిరి
ఆంధ్రుడు మా కడ దోపిడిగాడు
రాయలసీముడు భూ కబ్జాగాడు
సీమాన్ద్రునికిపుడు సిగ్గు లేదు
ఉమ్మినా తిట్టినా తుడుచుకున్నడు
దొమ్మికి దిగి మము దోచుకున్నడు
ప్రజాస్వామ్యమని మోసగించిరి
రజాకార్లనే మించిపోయిరి
నాలుగుకోట్ల నాలుకలొకటై
నినాదమే పోరు విధానమై
మా పాలన మాకేనని
తరిమి తరిమి కొట్టుదాం
కొత్త అస్త్రాలు పట్టుదాం
ప్రజాస్వామ్యమని మోసగించిరి
తెలగానవారి గోసమరిచిరి

No comments:

Post a Comment