37) అహ్ల్-ఎ-వర: కే హల్క మేఁ హర్చంద్ హూఁ జలీల్
పర్ ఆసియోఁ కే ఫిర్కా మేఁ మైఁ బర్గుజీద హూఁ
సాధుజనుల సంఘంలో అన్నివిధాల భ్రష్టుణ్ణి
మరి పాపాత్ముల వర్గంలో నేనే మహాత్ముణ్ణి
38) ఖత్ర: ఖత్ర:, ఇక్ హయూల హై, నఏ నాసూర్ కా
ఖూఁ భీ, జోక్-ఎ-దర్ద్ సే, ఫారిఘ్ మెరే తన్ మేఁ నహీఁ
నా ప్రతి రక్తపు బిందువు ఒక క్రొత్త వ్రణానికి సూచి
నా మేనులో హృదయమే కాదు నెత్తురు సైతం కోరుతోంది బాధల రుచి
39) హమ్ కో సితం అజీజ్ , సితంగర్ కో హమ్ అజీజ్
నామెహర్బాఁ నహీఁ హై, అగర్ మెహర్బాఁ నహీఁ
ప్రణయవేదన మాకు ప్రియం, వేదించే వారికి మేము ప్రియం
ఆమె నిర్దయి మాత్రం కాదు, చూపకపోయినా కనికరం
40) జహాఁ తేరా నక్ష-ఎ-ఖదం దేఖ్తే హైఁ
ఖియాబా ఖియాబా ఇరం దేఖ్తే హైఁ
నీ పాద చిహ్నాలనెచట చూసినా
నందనవనాలే దర్శనమిస్తాయి
41) బనా కర్ ఫకీరోఁ కా భేస్ గాలిబ్!
తమాషా-ఎ-అహ్ల్-ఎ-కరం దేఖ్తే హైఁ
యాచకుల వేషం కట్టి, ఓ గాలిబ్!
మేము వదాన్యుల తమాషాలు తిలకిస్తాము
42) కబ్ సే హూఁ, క్యా బతాఊ, జహాన్-ఎ-ఖరాబ్ మేఁ
శబ్ హా-ఎ-హిజ్ర్ కో భీ రఖూఁ గర్ హిసాబ్ మేఁ
ఏనాటినుండి వెతల పాలయ్యానో ఏం చెప్పను, ఈ పాడులోకంలో
ఇంకా దారుణం, వియోగరాత్రులు లెక్కిస్తే నా శోకంలో
43) తా ఫిర్ న ఇంతిజార్ మేఁ నీంద్ అయే న ఉమ్ర్ భర్
ఆనే కా అహద్ కర్ గయే, ఆయే జో ఖ్వాబ్ మేఁ
కలలో కనపడి కలుస్తానని మాటిచ్చిరి కరుణతో
నిద్రయే మాకిక కరువాయె, కలలెక్కడ ఈ ప్రతీక్షలో
44) ఖాసిద్ కే ఆతే ఆతే ఖత్ ఎక్ ఔర్ లిఖ్ రఖూఁ
మైఁ జాన్తా హూఁ వొహ్ జో లిఖేంగే జవాబ్ మేఁ
దూత రాకముందే రాసి ఉంచితి ఇంకో జాబు
నేనెరుగనా ఆమె రాసి పంపించే జవాబు
45) ముఝ్ తక్ కబ్ ఉన్కీ బజ్మ్ మేఁ ఆతా థా దౌర్-ఎ-జాం
సాఖీ నె కుఛ్ మిలా న దియా హో షరాబ్ మేఁ
మా వరకు ఎప్పుడొచ్చిందని పానపాత్ర ఆమె గోష్టిలో
ఏమైనా కలపలేదుగా సాఖీ, ఇపుడు మదుకలశంలో
46) మైఁ ఔర్ హజ్జా-ఎ-వస్ల్, ఖుదాసాజ్ బాత్ హైఁ
జాఁ నజ్ర్ దేనీ భూల్ గయా, ఇంతిజార్ మేఁ
మన సంయోగసుఖసౌభాగ్యం, అది భగవదేచ్చ
సంగమ హర్షోన్మాదంలో ప్రాణాలు నీకర్పించడం మరిచా
47) వొహ్ నాలః దిల్ మేఁ ఖస్ కే బరాబర్ జగః న పాయె
జిస్ నాలే సె శిగాఫ్త్ పడే ఆఫ్తాబ్ మేఁ
లేశమంత స్థానం నీ యదలో పొందకపాయె నా విలాపం
బీటలు వార్చెను రవిలో అదే ఆర్తిభరితనాదం
48) కల్ కే లియే కర్ ఆజ్ న ఖిస్సత్ షరాబ్ మేఁ
యః సూ-ఎ-జన్ హైఁ సాఖీ-ఎ-కౌసర్ కే బాబ్ మేఁ
రేపటి కోసం యీ పూట త్రాగడం తగ్గించకు మిత్రమ!
ఇది స్వర్గంలో సాఖీ సౌజన్యం శంకించడమే సుమ!
49) రౌ మేఁ హై రఖ్ష్-ఎ-ఉమ్ర్, కహాఁ దేఖిఏ థమే
నె హాథ్ బాగ్ పర్ హైఁ, న పా హైఁ రికాబ్ మేఁ
యమదౌడులోనున్నది జీవితమనే రౌతు,
ఎంత చేసినా తగ్గదుగా జోరు;
నియంత్రించే పగ్గం చేత లేదు,
మా పాదం రికాబులో లేదు
50) ఉత్నా హీ ముఝ్ కో అప్నీ హకీకత్ సె బు అద్ హై
జిత్నా కె వహం-ఎ-ఘైర్ సె హూఁ పేచ్ ఓ తాబ్ మేఁ
తత్త్వము వేరను భ్రమలో నేనెంత విధురత నొందితినో
అంతే దూరమై భాసించె, నా సత్యస్వరూపం నా నుండి

No comments:
Post a Comment