Sunday, September 18, 2011

కటాక్ష నిహతులు

బయాఁ క్యా కీజే బేదాద్-ఎ-కావిష్-ఎ-మిజ్గాఁ కా
కె హర్ ఇక్ ఖత్ర:-ఎ-ఖూఁ దాన హై తస్బీ:-ఎ-మిర్జాఁ కా


ఎలా వర్ణించను ఆమె కనుపక్ష్మలు తీక్ష్ణవేదన రగిల్చగా
నా ప్రతిరక్తపు బిందువు మారె జపమాలలో పగడపు పూసగా


ఖామోషీ మేఁ నిహాఁ ఖూఁ గష్త లాఖోఁ ఆర్జూఏ హైఁ
చిరాగ్-ఎ-ముర్ద: హూఁ , మైఁ బేజబాన్ గోర్-ఎ-గరీబాఁ కా

స్వరక్తసిక్తమై లక్ష కోరికలు నా మౌనంలో దాక్కున్నాయి
ఒక అపరిచితుని సమాధిపై జిహ్వలేని దగ్ధ జ్యోతినయ్యాను


ముహాబా క్యా హైఁ మైఁ జామిన్ ఇధర్ దేఖ్
షహీదాన్-ఎ-నిగ: కా ఖూఁ-బహా క్యా ?

భయంమెందుకు, నేను జామీను, ఇటు చూడు
నీ కటాక్ష నిహతులకు పరిహారమేముండు?

No comments:

Post a Comment