Monday, September 12, 2011

దివాన్-ఏ-గాలిబ్ 76 నుండి

76) లుట్తా దిన్ కో, తో కబ్ రాత్ కో యూఁ బేఖబర్ సోతా
రహా ఖట్కా చోరీ కా, దుఆ దేతా హూఁ రహ్జన్ కో

ప్రొద్దున్నే దోచుకోబడక పోతే, రాత్రికి మైమరిచిన నిద్రుండేదా?
దోపిడీల భయమిక లేదు, దొంగకు నా ఆశీర్వచనం

77) సున్తే హైఁ బహిష్త్ కీ తారీఫ్, సబ్ దురుస్త్
లేకిన్ ఖుదా కరే, వో: తేరా జల్వ:గాః హో

స్వర్గం గూర్చి ప్రశంస లెన్నో వింటాము, నిజమే
ప్రియతమా! అది నీ మందిరమయితేనే మాకు ఒప్పు

78) కిసీకో దేకె దిల్ కోయీ నవా సంజ్--ఫుగాఁ క్యూఁ హో
హో దిల్ హీ సీనే మే, తో ఫిర్ ముఁహ్ మే జబాన్ క్యూఁ హో

మనసెవరికో యిచ్చిన పిదప, యీ శోకవిలాపాలెందుకో
రొమ్ములో గుండే లేనపుడు, నోట్లో యిక నాలుకెందుకో?

79) ముఝ్ కో వో: దో కె జిసే ఖాకే నా పాని మాన్గూ
జహర్ కుఛ్ ఔర్ సహీఁ, ఆబ్--బాకా ఔర్ సహీఁ

గరళమైనా సరే యింకా గుప్పించు , మరికొంచెమమృతమయినావడ్డించు
ఏది సేవిస్తే యిక తృష్ణ మిగలదో, పీయూషమే నాకు త్రాగించు

80) ఖయాల్--మర్గ్, కబ్ తస్కీన్ దిల్--ఆజుర్ద కో బఖ్శే
మెరే దాం--తమన్నా మేఁ హైఁ ఎక్ సైద--జబూఁ వో: భీ

నిధనమే నిర్వాణమను భావన సైతం
నా వ్యాకుల మనసునోదార్చకున్నది;
మృత్యువే నా ఆశల వలలో
క్రూర మృగంలా చిక్కుకున్నది

81) మెరే దిల్ మేఁ హైఁ గాలిబ్ షౌఖె--వస్ల్--షిక్వః--హిజ్రాఁ
ఖుదా వో: దిన్ కరే, జో ఉస్ సే మైఁ యహ్ భీ కహూఁ, వొహ్ భీ

సంగామాభిలాష, విరహవేదన, రెండూ ఉన్నాయి గుండెలో గాలిబ్!
రోజే రావాలి, తనకు అదీ నివేదిస్తాను, యిదీ వినిపిస్తాను

82) బహత్ సహీ గం--గైతీ, షరాబ్ కం క్యా హై?
గులామ్--కౌసర్ హూఁ, ముఝ్ కో గమ్ క్యా హై ?

బ్రతుకు వెతలెన్నెన్నో నిజమే, అయినా యిచట మధువుకేమి కొరత?
స్వర్గంలో 'సాఖీ'కి దాసుణ్ణయ్యాను, యిక పరలోకంలోనూ వుండదు కలత

83) కటే తో షబ్ కహేఁ, కాటే తో సాంప్ కహ్లావే
కోయీ బతావో కె వొహ్ జుల్ఫ్--ఖం ఖం క్యా హై

గడచిపొతే శుభరాత్రి, కాటువేస్తే కాలనాగు
ఎవరయినా తెలిపెదరా, ఆమె కురులు యింద్రనీలాలవనులేమిటని

84) రిందాన్--దర్--మైఖద గుస్తాక్ హైఁ, జాహిద్!
జిహార్! హోనా తరఫ్ ఇన్ బేఅద్బోఁ సే

పంతులు గారు! మధుశాల వద్ద వారుణీవరులు
వారి వైపు వెళ్ళొదెపుడూ, వారు సంస్కారహీనులు

85) లిపట్నా పర్నియోఁ మేఁ శోలః--ఆతిష్ ఆసాన్ హైఁ
వలె ముష్కిల్ హైఁ హిక్మత్, దిల్ మేఁ సోజ్--గం ఛుపానే కి

పట్టుగుడ్డతో అగ్ని కీలల్ని చుట్టడం సాధ్యం
గుండెల్లో అనురాగశోకాన్ని దాచడమసాధ్యం

86) ఆగ్ సే పానీ మెఁ బుఝ్తే వక్త్ ఉట్తీ హై సదా
హర్ కొఈ దర్మాన్దగీ మెఁ నాలే సే నాచార్ హై

అగ్ని సైతం నీట సమసిపోతూ చేయును మృత్యు ఘోష
నిస్సహాయుడయిన ప్రతిజీవి విలపించును వదలక ఆశ

87) ఫిజా క్యా, ఫస్ల్-ఎ-గుల్ కహ్తే హై కిస్ కో, కొఈ మౌసం హో
వొహీ హం హైఁ, కఫస్ హై, ఔర్ మాతం బాల్-ఓ-పర్ కా హైఁ

పుష్పించే వసంతమో ఆకురాల్చే శరదమో, ఏ కాలమైతే మాకేమి
అదే నేను, అదే పంజరం, అదే జీవన శోకం

88) ఇష్క్ ముఝ్ కో నహీఁ వహ్శత్ హీ సహీ
మేరి వహ్శత్, తేరి శోహ్రత్ హీ సహీ

నాది ప్రేమ కాదంటే, మరి లాలసే యని పిలువు
నా లాలసతో నీకు యశస్సు రానివ్వు



89) జబ్ కే తుం బిన్ నహీఁ కొఈ మౌజూద్
ఫిర్ యః హన్గామ ఐ ఖుదా, క్యా హైఁ?

నీవు తప్ప యింకెవరూ లేనపుడు
భగవంతుడా! యీ ఉపద్రవాలెందుకు?

90) జాన్ తుమ్ పర్ నిసార్ కర్ తా హూఁ
మైఁ నహీఁ జాన్తా, దుఆ క్యా హైఁ?

ప్రాణం నీకే అర్పంచుకుంటా
పూజలేమిటో నాకు తెలియదు

91) ఆతీ హైఁ ఘైబ్ సే ఏ మజామీన్ ఖయాల్ మేఁ
గాలిబ్! సరీర్-ఎ-ఖామ: నవా-ఎ-సురోష్ హై

గాలిబ్! దార్శనిక కవితావిషయాలన్నీ అవ్యక్తం నుండే వెలయు
నీ కలం చేయు కిరకిరరవం, అమరుల నాదమని తెలుయు

92) దేఖ్నా హాలత్ మెరే దిల్ కీ, కే హం ఆగోషీ కే వఖ్త్
హై నిగాః-ఎ-ఆశనా, తెరా సర్-ఎ-హర్ మూ ముఝేఁ


మన ఆలింగన భంగిమలో నా హృదయ పరిస్థితి గమనించు
నీ శిరోజాల ప్రతి చక్రం నా పై మదనదృష్టి సారించు


93) జిస్ బజ్మ్ మేఁ తూ నాజ్ సే గుఫ్తార్ మేఁ ఆవే
జాన్ కాల్ బుద్-ఎ-సూరత్-ఎ-దీవార్ మేఁ ఆవే


బిబ్బోకవతివై సభలో నువు సరససంభాషణ సల్పడం
ప్రాణం పోసుకునె అది విని, గోడన వ్రేలాడు చిత్రపటం


94) దే ముఝ్ కో షికాయత్ కీ ఇజాజత్, కె సితం గర్!
కుఛ్ తుఝ్ కో మజా భీ మెరే ఆజార్ మేఁ ఆవే

గోడు వినిపించ ఆనతినివ్వు పాషాణహృదయా!
నా దు:నివేదన విని కొంత సంతసించెదవు ప్రియా


95) ఉన్కె దేఖే సే ఆజాతి హై జో మున్హ్ పర్ రౌనక్
వొహ్ సమఝ్ తే హై కె బీమార్ క హాల్ అచ్చా హై

ఆమె వోరచూపుతో మోము పై అలరారు తేజస్సు
భావించిరి అది కని రోగికి కుశలమేనని వారు

96) హమ్ కో మాలూమ్ హై జన్నత్ కీ హకీకత్ లేకిన్
దిల్ కె ఖుష్ రఖనే కో, గాలిబ్! ఏ ఖయాల్ అచ్చా హై

మేమెరుగుదుము ఆ జన్నత్ వాస్తవాలు, అయినా
మనసును సుఖపెట్టేందుకు గాలిబ్! బావుంది యీ భావన


97) న సితాయిష్ కి తమన్నా, న సిలే కి పర్వా
గర్ నహీఁ మెరే అషార్ మేఁ మానీ న సహీ


సన్మాన బహుమానాల ఆశలేదు, ప్రశంస పొగడ్తలక్కర్లేదు
నా కవితల్లో అర్థం లేదనుకుంటే, పొనీ గాక

98) ఖుదా కి వాస్తే దాద్ ఇస్ జునూన్-ఎ-శౌక్ కీ దేనా
కె ఉస్కే దర్ పే పొహంచ్ తే హై, నామబర్ సె హమ్ ఆగే

దూత కన్నా ముందే ప్రేయసి వాకిట నే వాలడం
మెచ్చుకోండి మనసార, నా ప్రేమపిచ్చి యిలా మారడం


99)వొహ్ చీజ్ జిస్ కే లిఏ హమ్ కో హై బహిష్త్ అజీజ్
సివాయ్ బాద:-ఎ-గుల్ఫాం-ఎ-ముష్క్ బూ క్యా హై

ఏ వస్తువుకోసం స్వర్గం మాకు ప్రీతి, అతి గొప్ప
పరిమళాలు వెదజల్లే అరుణవారుణి తప్ప

100) పీయూఁ షరాబ్, అగర్ ఖుం భీ దేఖ్ లూఁ దో చార్
యే శీశ-ఒ-కదా-ఒ-కూజ-ఒ-సబూ క్యా హైఁ

నాలుగు కడవలయినా కనిపిస్తే త్రాగడం మొదలెట్టొచ్చు
ఈ సీసాలు, ముంతలు, యీ గిలాసలు నా కేమి కిక్కునిచ్చు


101) రగోఁ మేఁ దౌడ్తే ఫిర్నే కె హమ్ నహీఁ ఖాయల్
జబాన్ఖ్ హీ సె న టప్కా తో ఫిర్ లాహూ క్యా హై

ధమనుల్లో పరుగెత్తడం యేముంది అందు గొప్పతనం
కళ్ళ నుండి రాలనపుడు రక్తమెట్లవును సార్థకం?


102) నుఖ్తచీఁ హై గం-ఎ-దిల్ ఉస్కో సునాయే న బనే
క్యా బనే బాత్ జహాఁ బాత్ బనాయే న బనే


దోషమెంచడమే ఆమె పని, మనోవ్యథ వినిపించుకోదెంత చెప్పినా
ఆశలు నెరవేరునెట్లో, అచట ఫలితం శూన్యం హృదినెంతవిప్పినా

103) ఇష్క్ పర్ జోర్ నహీఁ, హై యే వొహ్ ఆతిష్ గాలిబ్!
కె లగాయే న లగే ఔర్ బుఝాఏ న బనే

ప్రేమపై అధికారమొప్పదు, ప్రేమ నిప్పులాంటిది
రగిలిస్తే రగలనిది, రగిలితే మరి ఆరిపోనిది

104) మత్ పూఛ్ కె క్యా హాల్ హై మేరా, తెరె పీఛే
తూ దేఖ్ కె క్యా రంగ్ హై తేరా మెరే ఆగే

నీ విరహంలో నా గతి, నన్నడగకు యెంత విధురమో
నా సన్నిధిలో చూడు నీ స్థితి, ఎంత మధురమో

105) గో హాత్ మేఁ జుమ్బిష్ నహీఁ, ఆంఖో మేఁ తో దం హై
రహ్నే దో అభీ సాఘర్-ఒ-మీనా మెరే ఆగే

చేతుల్లో శక్తి లేకున్నా వుందికదా కళ్ళలో ప్రాణం
కలశం, పాత్రలు వుంచు నా ముందే, ఎత్తకిపుడే బిచాణం

106) రోనే సె ఔర్ ఇష్క్ మేఁ బేబాక్ హో గయే
దోయే గయె హమ్ ఇతనే, కె బస్ పాక్ హో గయే


విలపించి విలపించి ప్రేమలో యింకా నిర్భయులమయ్యాము
అశ్రుధారలు ప్రవహింపగ పునీతులమయ్యాము


107) కహ్తా హై కౌన్ బుల్బుల్ కో బే అసర్
పర్దే మేఁ గుల్ కె, లాఖ్ జిగర్ చాక్ హో గయే

బుల్బుల్ పక్షుల విలాపానికి ఎవరు కారు ప్రభావితం
పూవు హృదయంలో తొంగి చూడు కంటావు లక్ష దళాలు ఖండితం

108) హజారో ఖ్వాహిశే ఐసీ కె హర్ ఖ్వాహిష్ పె దం నిక్లే
బహత్ నిక్లే మెరే అర్మాన్ లేకిన్ ఫిర్ భి కం నికలే

శతసహస్ర కోరికలు, ప్రతి కోరిక పై పణం నా ప్రాణం
ఫలించాయి ఎన్నో అభీష్టాలు అయినా తక్కువే వాటి పరిమాణం


109) మోహబ్బత్ మేఁ నహీఁ హై ఫర్క్ జీనే ఔర్ మర్నే కా
ఉసీ కో దేఖ్ కర్ జీతే హై, జిస్ కాఫిర్ పె దమ్ నిక్లే

జీవన్మరణాల మధ్య భేదముండదు, యిది ప్రణయప్రయాణం
వారినే స్మరిస్తూ బ్రతకాలి యే నిర్దయి కోసం వదిలామో ప్రాణం

110) రోనే సె నదీం! న మలామత్ కర్ ముఝే
ఆఖిర్ కభీ తో అఖ్ద్-ఏ-దిల్ వా కారే కోఈ

నేను విలపిస్తే నను నిందించకు మిత్రమా!
మనసులోని ముళ్ళను ఎప్పటికయినా విప్పాలి సుమా

110) నాకామి-ఏ-నిగాః హై బర్ఖ్ -ఏ-నజ్జార-సోజ్
తూ వో నహీ కే తుఝ్ కో తమాషా కరే కోఈ

విద్యుత్కాంతుల దేదీప్యం అతి దుష్కరం నీ దర్శనం
నిను తమాషాగా తిలకించడం కాదు ఎవరికీ సాధ్యం

111) వరఖ్ తమాం హుఆ ఔర్ ముద్దా బాఖీ హై
సఫీనా చాహియే ఇస్ బహర్-ఎ-బేకరాఁ కే లిఏ

పొత్తమంతా పొగడ్త నింపినా, వర్ణన యింకా మిగిలెనే!
యీ అపారసాగరతరణం సాధ్యమా, నీ కరుణాతరి లేనిదే









No comments:

Post a Comment